— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Ila Tripathi : ప్రజా దీవెన, శాలిగౌరారం: చిన్నా రుల, గర్భిణీలు, బాలింతల ఆరో గ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చ ర్యలు చేపట్టుతున్నట్లు జిల్లా కలె క్ట ర్ ఇలా త్రిపాఠీ అన్నారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో మహిళా స మాఖ్యా కార్యాలయంలో పోషణ్ అ భియాన్ మహోత్సవం లో భాగంగా ఐసీడిఎస్ ఆధ్వర్యంలో లో గర్భిణీ లకు సామూహిక సీమంతం కార్యక్ర మం లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడు తూ పౌష్టిక విలువలతో కూడిన ఆ హారం తీసుకుంటే రోగనిరోధక శక్తి, జ్ఞాపకశక్తి పెరుగుతుందన్నారు. ప్రో టీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలన్నా రు. తల్లీ దండ్రులు చిన్నారుల ఆరోగ్య సంరక్షణ లో నిర్లక్ష్యంగా వ్యవహారించొద్దని సూచించారు.
ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ, మం డల స్పెషల్ ఆఫీసర్ శేఖర్ రెడ్డి, ఎంపీడీఓ గార్లపాటి జ్యోతి లక్ష్మి, తహసీల్దార్ బిట్ల వరప్రసాద్, ఎం ఈఓ మందుల సైదులు, ఐసీడిఎస్ సిడిపిఓ అశ్రా అంజుం, ఏపిఓ జం గమ్మ, ఏపిఎం పోలేపల్లి శంకర్, ఐసీడిఎస్ సూపర్వైజర్ సునీత, జ్యోతి,పిపిజీ ప్రథమ ఫౌండేషన్ ఛై ర్మెన్ అరుణశ్రీ,అంగన్వాడీ టీచ ర్లు, పిల్లల తల్లీ దండ్రులు పాల్గొన్నారు.
*వైద్య సిబ్బంది రోగులకు అం దుబాటులో ఉండాలి* శాలిగౌరారం లోని ప్రాథమిక ఆరో గ్య కేంద్రం డాక్టర్లు,వైద్య సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండా లని కలెక్టర్ ఇలా త్రిపాఠీ అన్నా రు.ఆమె ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. అన్ని గదులను క్షు ణ్ణంగా పరిశీలించారు. ఆసుపత్రి స్లా బ్ పెచ్చులు ఊసి ఉండటం గమ నించి నూతన భవనానికి ప్రతిపాద నలు తయారు చేయాలని అధికా రులను అదేశించారు. అనంతరం క స్తూరి భాయి గురుకుల బాలికల పాఠశాలను తనిఖీ చేశారు. విద్యా ర్థులతో ముచ్చటించారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం, బోధన అందించాలని ఎస్ఓ నాగ రాణి కి సూచించారు. అడ్లూర్, తు డిమిడి లోని ఐకేపీ కేంద్రాలను ఆక స్మిక తనిఖీ చేశారు. రైతులకు ఎటు వంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొ నుగోళ్లను సక్రమంగా చేపట్టాలని చె ప్పారు.రైతులు తేమలేని ధాన్యం తీసుకొచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు.ఈ కార్యక్రమం లో నల్లగొండ ఆర్ డి ఓ యానాల అశో క్ రెడ్డి వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గోన్నారు.