Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Zika virus: జీకా వైరస్ జంకు…!.

–మహారాష్ట్రలో పెరుగుతున్న కేసులతో ఆందోళన
–రాష్ట్రంలో విజృంభిస్తున్న సీజనల్‌ వ్యాధులతో జీకా పట్ల అప్రమత్తం
–నేటికీ సంసిద్ధంగా లేని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ

Zika virus: ప్రజా దీవెన,హైదరాబాద్‌: పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో జికా వైరస్‌ (Zika virus) విజృంభిస్తోంది. రెండు రోజుల క్రితం పుణెలో ఒక్క రోజే ఆరు జికా వైరస్‌ వ్యాధి (జడ్‌వీడీ) కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపద్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం బుధవారం అన్ని రాష్ట్రా లను అప్రమత్తం చేసింది. ఈమేరకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (Director General of Health Services) (డీజీహెచ్‌ఎ్‌స) డాక్టర్‌ అతుల్‌గో యల్‌ అడ్వైయిజరీ జారీ చేశారు. జికాపై నిరంతరం అప్రమత్తంగా ఉం డాలని, ముఖ్యంగా గర్భిణులను స్ర్కీనింగ్‌ చేయాలని కేంద్రం సూచిం చింది. జికా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధా రణ అయిన గర్భిణుల్లో పిండం ఎదుగుదలను పర్యవేక్షించాలని స్పష్టం చేసింది. ప్రతి ఆస్పత్రిలో కచ్చితంగా ఒక నోడల్‌ ఆఫీసర్‌ను నియమించాలని, ఆ అధికారి జికా వైరస్‌ వ్యాప్తికి కారణమయ్యే దోమల పెరుగుదల నివారణకు చర్యలు చేపట్టాలని కోరింది. జికా కేసులు నమోదైతే వెంటనే నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ వెక్టర్‌ బోర్న్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్‌సీవీబీ డీసీ)కు రిపోర్టు చేయాలని, అనుమానిత నమూనా లను పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూ ట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపాలని సూ చించింది. అలాగే ఐసీఎంఆర్‌ ఆధ్వర్యం (Under ICMR)లోని వైరస్‌ పరిశోధనా కేంద్రాల కు కూడా శాంపిళ్లను పంపాలని ఆదేశించింది. జీకాపై రాష్ట్ర వైద్యశాఖ నిర్లక్ష్యం… మహారాష్ట్ర నుంచి తెలంగాణకు రోజూ వేలాదిమంది రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేప థ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి మహమ్మారులు ప్రబలిన ప్పుడు వాటిని నియంత్రించే బాధ్య త క్షేత్రస్థాయిలో ప్రజారోగ్య సంచా లకులకే ఉంటుంది. అయితే మన వద్ద ఇంతవరకు అందుకు సంబం ధించిన కార్యాచరణేమీ కానరావ డంలేదు. ఇప్పటికే రాష్ట్రంలో ఒక వైపు డెంగ్యూ, మలేరియా, చికెన్‌గు న్యా వంటి సీజనల్‌ వ్యాధుల వి జృంభణ ప్రారంభమైంది. గత ఐదు నెలల్లో మలేరియా, డెంగ్యూ మర ణాలు కూడా సంభవించాయి. పటి ష్ట పర్యవేక్షణ లేకపోవడంతో సీజ నల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయ న్న అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో వీటిపై అవగాహన ఉన్న విభాగాధి పతి లేకపోవడం ప్రధాన సమస్యగా మారిందని వైద్యవర్గాలు చెబుతు న్నాయి. అందుకే సీజనల్‌ వ్యాధు లు విజృంభిస్తున్నాయన్న ఆరో పణలు వినిపిస్తున్నాయి.

దోమల ద్వారా విస్తృత వ్యాప్తి.. జికా వైరస్‌ (Zika virus) అనేది దోమల ద్వారా సంక్రమించే ఫ్లేవి వైరస్‌ అని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. జికా ప్రధానంగా ఏడెస్‌ దోమల కా టు ద్వారా వ్యాపిస్తుందని, ఇదే దో మ కుడితే డెంగ్యూ, చికున్‌గున్యా, ఎల్లో ఫీవర్‌ వైర్‌సలు కూడా సోకు తాయి. జికా సోకితే సాధారణ లక్ష ణాలే ఉంటాయి. ఇవి 2-7 రోజుల పాటు కనిపిస్తాయి. ముఖ్యంగా జ్వ రం, దద్దుర్లు, కీళ్ల నొప్పి, కండ్లకలక (ఎరుపు కళ్లు), కండరాలు, తల నొప్పితో పాటు మరికొన్ని తీవ్రమైన సమస్యలు కలుగుతాయి. మైక్రోసె ఫాలీ (పుట్టుక లోపం), గులియన్‌ బారే సిండ్రోమ్‌ (న్యూరోలాజికల్‌ డిజార్డర్‌), మెనింజైటిస్‌ (మెదడు, వెన్నెముక లైనింగ్‌ వాపు)లాంటి వాటికి కారణమౌతుంది. ఇదిలా ఉంటే దోమల వృద్ధిని నివారించ డానికి ఇళ్లు, బహిరంగ ప్రదేశాల చుట్టూ నిలిచిన నీటిని తొలగించా లని, జికా కూడా లైంగికంగా సం క్రమించే అవకాశం ఉన్నందున సురక్షితమైన విధానాలను పా టించాలి. జికాకు నిర్దిష్ట చికిత్స లే దు, కానీ లక్షణాల ఆధారంగా చికి త్సను అందిస్తారు. జికా లక్షణాలు కనిపిస్తే వెంటనే సరైన రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుని డాక్టర్‌ను సంప్రదించాలని సూచించారు.