Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Karimnagar KTR road show:రాజకీయ లబ్ధికి శ్రీరాముడి వాడుకోవడమా

లంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న తీరు జుకుప్సాకరంగా ఉన్నాయని, ముఖ్యంగా శ్రీ రాము డిని దేశానికి పరిచయం చేసింది బిజెపినే అన్నట్లు ప్రచారం చేసుకో వడం గర్హనీయమనని వ్యాఖ్యానిం చారు.

శ్రీరాముడు బీజేపీ ఎంపీనా, లేదంటే బీజేపీ ఎమ్మెల్యేనా
శ్రీ రాముడిని దేశానికి పరిచయం చేసిoది బీజేపీ అన్నట్లు ప్రచారం
బీజేపీపై ద్వజమేత్తిన బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు(Parliament elections) జరుగుతున్న తీరు జుకుప్సాకరంగా ఉన్నాయని, ముఖ్యంగా శ్రీ రాము డిని దేశానికి పరిచయం చేసింది బిజెపినే అన్నట్లు ప్రచారం చేసుకో వడం గర్హనీయమనని వ్యాఖ్యానిం చారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్న తరుణంలో మరోసారి బీజేపీ, కాంగ్రెస్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు(KTR) తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఆదివారం కరీంనగర్ లో కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వ హించారు. బీఆర్ఎస్ అభ్యర్థి వినో ద్ కుమార్ గెలిపించాలని అభ్యర్థిం చారు. దేవుడైనా రాముడిని బీజేపీ(BJP) నేతలు రాజకీయాల్లోకి తీసుకొచ్చి లబ్ధి పొందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి దానికి రాము డిని తెరమీదకు తీసుకువస్తున్నా రని చెప్పారు. శ్రీరాముడు బీజేపీ ఎంపీనా లేక బీజేపీ ఎమ్మెల్యేనా సూటిగా బీజేపీ నేతలను కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.

రాముడు అందరికీ దేవుదేనని స్పష్టం చేశారు. రాముడిని దేశానికి బీజేపీనే పరిచ యం చేసినట్లుగా ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ లేకపోతే బొట్టే పెట్టుకోలేము అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ ఉన్నా దేవుడు ఉంటాడని బీజేపీ లేకపోయిన దేవుడు ఉంటాడని తేల్చిచెప్పారు. కరీంనగర్(Karimnagar) లో బండి సంజయ్ సీఎం రేవంత్రెడ్డి కుమ్మక్కయ్యారని ఆరోపించారు. డమ్మీ క్యాండిడేట్ను పెట్టి సంజయ్ను మరోసారి ఎంపీగా గెలిపించాలని చూస్తున్నారని విమర్శించారు.

కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ఎవరికీ తెలియదని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలమైన అభ్యర్థిని పెడితే బీఆర్ఎస్(BRS) గెలుస్తుందని రేవంత్ భయపడ్డారన్నారు. రేవంత్ రెడ్డి సీఎం ఆ లేక బోటీ కొట్టేటోడా. పేగులు మెడలో వేసుకోవడం ఏందీ అని ప్రశ్నించారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి కేంద్రం నుంచి ఒక్క రూపాయి అయినా బండి సంజయ్ తెచ్చారా అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.

BJP political game with Sri ramudu