Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

farmers problems: అన్నదాత సమస్యలపై బీజేపీ ఆందోళన

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రైతు సమస్యలపై భారతీయ జన తా పార్టీ రణభేరీ మోగించింది. ఒకవైపు 6 గ్యారంటీల అమలుపై వివిధ రూపాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని నిర్ణయించిన బీజేపీ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే గేయంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.

నేడు బీజేపీ నేతల వడ్ల కల్లాల సందర్శన
20న తహిసిల్దార్, కలెక్టర్లకు వినతి పత్రాలు
21న అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షలు
కరీంనగర్ ఎంపీ నియోజకవర్గ బీజేపీ కార్యాచరణ ప్రారంభం
బీజేపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ లో ఎంపీ బండి సంజయ్

ప్రజా దీవెన, కరీంనగర్: తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న( farmers problems) సమస్యల్ని పరిష్కరించాలని, పండించిన ధాన్యానికి క్వింటాలుకు రూ.500ల బోనస్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని  బిజెపి శాసనసభాపక్ష నేత అలేటి మహేశ్వర్ రెడ్డి , బిజెపి ఎమ్మెల్యేలు పైడి రాకేశ్ రెడ్డి, రామారావు పాటి పవర్ తదితరులు కలిసి వినతిపత్రం సమర్పించారు.

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రైతు సమస్యలపై( farmers problems) భారతీయ జన తా పార్టీ రణభేరీ మోగించింది. ఒకవైపు 6 గ్యారంటీల(six guarantees) అమలుపై వివిధ రూపాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని నిర్ణయించిన బీజేపీ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే గేయంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.అందులో భాగంగా బీజేపీ(BJP)నేతలంతా తమ తమ ప్రాంతాల్లో వడ్ల కల్లాలను సందర్శించి రైతులకు అండగా నిలవాలని నిర్ణయించింది. ఇప్పటికే అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవ డంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపిస్తున్న బీజేపీ నాయకత్వంప్రక్రుతి వైపరీత్యాలను అధిగమించి పండించిన వడ్లను కల్లాల వద్దకు తీసుకొచ్చి రోజలు గడుస్తున్నప్పటికీ కొనుగోలు చేయ డంతో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబిస్తున్న తీరును కల్లాల సందర్శన ద్వారా ఎండగ ట్టాలని నిర్ణయించింది.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్(MP Bandi sanjay kumar) కొద్దిసేపటి క్రితం కరీంనగర్ పార్లమెంట్ నియో జకవర్గ పరిధిలోని మండల కమిటీలు, ఆ పైస్థాయి నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్శహించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతుల వివరాలను సేకరించేందుకు వడ్ల కల్లాలను సందర్శించాలని కోరారు. తద్వారా పంట నష్టం వివరాలను సేకరించడంతోపాటు తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా వడ్లను కొనుగోలు చేసేలా ప్రభుత్వం ఒత్తిడి తేవాలని పిలు పునిచ్చారు. అదే సమయంలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హమీ మేరకు వడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వాలని, సన్నాలు, దొడ్డు అనే తేడా లేకుండా అన్ని రకాల వడ్లకు బోనస్ ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు అండగా నిలవాలని కోరారు. దీంతోపాటు రైతు భరోసా కింద వచ్చే వానాకా లం సీజన్ నుండి రైతులు, కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12వేలు ఇచ్చేదాకా సర్కార్ పై వివిధ రూపాల్లో నిరసనలు తెలపాలని సూచించారు.

రైతులకు ఇచ్చిన హామీలతోపాటు 6 గ్యారంటీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభు త్వం పూర్తిగా ఉదాసీన వైఖరి అవలంబిస్తోందన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయా లంటే దాదాపు రూ.35 వేల కోట్ల నిధులు అవసరమని ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేవని అన్నారు. వీటితోపాటు 6 గ్యారం టీల అమలుకు మరో రూ.లక్ష కోట్ల నిధులు అవసరమ వుతాయ న్నారు. ఈ నిధులను సమీకరిం చడంతోపాటు 6గ్యారంటీల అమలు కోసం విధివిధానాలను రూపొందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫల మైందన్నారు. దీనిని కప్పిపుచ్చు కునేందుకు ‘స్థానిక సంస్థల’ ఎన్నికలను తెరపైకి తీసుకొస్తోంద న్నారు. కాంగ్రెస్ సర్కార్ నిర్వాకం వల్ల రాష్ట్ర ప్రజలతోపాటు రైతాంగం తీవ్రమైన సంక్షోభంలో పడిపోయా రన్నారు. పండించిన వడ్లను కూడా అమ్ముకోలేని దుస్థితిలో ఉండిపో యారన్నారు. ఈ సంక్షోభ సమయం లో రైతులకు అండగా నిలవడంతో పాటు వడ్లను కొనుగోలు చేసే వరకు, బోనస్ ఇచ్చే వరకు పోరా టాలు చేయాలని పిలుపునిచ్చారు.

అందులో భాగంగా నేడు (శని వారం) వడ్ల కల్లాలను సందర్శిం చాలని ఆదేశించారు. ఎల్లుండి (ఆదివారం) అన్ని మండల, నియో జకవర్గ కేంద్రాల్లో మీడియా సమా వేశాలు నిర్వహించి రైతులు పడు తున్న బాధలను ప్రపంచానికి తెలియజేయాలన్నారు. అలాగే సోమవారం (20) అన్ని మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో తహి సిల్దార్, ఆర్డీవో, కలెక్టర్లకు రైతు సమ స్యలపై వినతి పత్రం అందజే యాలని ఆదేశించారు. అదే విధం గా ఈనెల 21న కరీంనగర్ పార్ల మెంట్ పరిధిలోని అసెంబ్లీ నియో జకవర్గ కేంద్రాల్లో రైతుల పక్షాన దీక్షలు చేపట్టాలని కోరారు. అయి నా ప్రభుత్వం దిగిరాని పక్షంలో బీజేపీ చేపడుతున్న ఆందోళనను మరింత తీవ్రతరం చేసేలా కార్యా చరణ రూపొందిం చాలని కోరారు.

BJP strike on farmers problems