Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CBI investigation: అవినీతి, ఆస్తిపాస్తులపై సిబిఐ విచారణకు సిద్ధమా

వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమ లు చేస్తామని మోసం చేసిన ప్రభు త్వాన్ని ప్రశ్నిస్తుంటే నాపై అవినీతి ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేత లారా నా ఆస్తిపాస్తులు, మీరు నాపై చేస్తున్న అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ కోరేందుకు నేను సిద్ధమని, మరి మీ ఆస్తిపాస్తులు, అవినీతి, బినామీ ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమా మీరు ఓకే అంటే సీబీఐకి లేఖ రాసేందుకు నేను సిద్ధంమని, దమ్ముంటే నా సవాల్ ను స్వీకరించాలి అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ మంత్రి పొన్నం ప్రభాకర్ సహా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు.

నా ఆస్తిపాస్తులపై సీబీఐకి లేఖ రా సేందుకు నేను సై, మీకు దమ్ముందా
నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ ల మధ్య కొనసాగుతున్న ఎన్నికలివి
దేశానికి ఎవరి నాయకత్వం కావా లో ఆలోచించి ఓటేయండి
కేసీఆర్ సుద్దపూసైతే సీబీఐ రా కుండా అడ్డుకున్నదెoదుకు
కరీంనగర్ లో గరీబోళ్ల బిడ్డకు, గడీల వారసులకు మధ్య జరు గుతున్న యుద్దమిది
వేములాడలో ప్రధాని మోదీ సభ ను దిగ్విజయవంతం చేయాలని పి లుపు
బీజేపీలో చేరిన బీఆర్ఎస్ కార్పొరే టర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు
మీడియా సమావేశంలో బీజేపీ జా తీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్

ప్రజా దీవెన, కరీంనగర్: వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమ లు చేస్తామని మోసం చేసిన ప్రభు త్వాన్ని ప్రశ్నిస్తుంటే నాపై అవినీతి ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్(Congress) నేత లారా నా ఆస్తిపాస్తులు, మీరు నాపై చేస్తున్న అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ కోరేందుకు నేను సిద్ధమని, మరి మీ ఆస్తిపాస్తులు, అవినీతి, బినామీ ఆస్తులపై సీబీఐ(CBI) విచారణకు సిద్ధమా మీరు ఓకే అంటే సీబీఐకి లేఖ రాసేందుకు నేను సిద్ధంమని, దమ్ముంటే నా సవాల్ ను స్వీకరించాలి అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ మంత్రి పొన్నం ప్రభాకర్ సహా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు.

కరీంనగర్ లో గరీబోళ్ల బిడ్డకు, గడీల వారసులకు మధ్య ఎన్నికల పోరు జరుగుతోంద ని, ఎవరి పక్షాన నిలిచి ఓటేస్తారో ఆలోచించుకోవాలని ప్రజలను కోరారు. దేశంలో ఎన్నికలు సైతం నరేంద్రమోదీకి, రాహుల్ గాంధీకి మధ్య జరుగుతున్నాయని, ఎవరి నాయకత్వం కావాలో ఆలోచించు కోవాలని సూచించారు. అదే సమ యంలో 10 ఏళ్ల ఎన్డీఏ పాలనపై అంతకుముందు 10 ఏళ్ల యూపీఏ పాలనపై బేరీజు వేసి ఎన్నికల్లో(elections) తీ ర్పు ఇవ్వాలని విజ్ఝప్తి చేశారు. కేసీఆర్ పెద్ద డ్రామా ఆర్టిస్టు అని, అవినీతికి కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు. తనను, తన కుటుంబాన్ని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు సీబీఐని రాష్ట్రంలోకి అడుగుపెట్టకుండా ఉత్తర్వులు ఇచ్చిన కేసీఆర్ సిగ్గులేకుండా తాను సుద్దపూసనని, మోదీ అరెస్ట్ చేసేం దుకు కుట్ర చేస్తున్నారని చెబుతు న్నారని విమర్శించారు. మంగళవా రం కరీంనగర్ లోని ఎంపీ కార్యాల యంలో బండి సంజయ్ సమక్షంలో ఇద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు బీజేపీలో చేరారు.

వీరితోపాటు మాజీ జడ్పీటీసీ ఎడ్ల శ్రీను, 47 డివిజన్ బీఆర్ఎస్(BRS) అధ్యక్షురాలు అన్నపూర్ణ, ఆరెపల్లి మాజీ సర్పంచ్ కాశెట్టి రాజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ పాదం రాజుసహా వందలాది బీఆర్ ఎస్ నేతలు బీజేపీలో చేరారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్, సీనియర్ నేత ఎర్రం వెంకట్రాజంతోపాటు సుమారు 50 మంది బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి సంజయ్(Sanjay) సమక్షం లో బీజేపీలో చేరారు. మండలాధ్య క్షులు పాదం శివరాజు ఆధ్వర్యంలో చేరిన వీరందరికీ కాషాయ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానిం చారు. ఈ సందర్భంగా బండి సంజ య్ చేసిన ఘాటు వ్యాఖ్యలు ఆయ న మాటల్లోనే …. బి ఆర్ ఎస్ నాయకులు మామిడాల రాజు బీజేపీ సిద్ధాం తాలు, మోదీ విధా నాలు నచ్చి బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరడం సంతోషంగా ఉంది. వారికి హ్రుదయ పూర్వక స్వాగతం చెబుతున్నా.

దీంతో పాటు విశ్వబ్రాహ్మణ సంఘం, ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ నాయ కులు కూడా బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నా. కరీంనగర్(Karimnagar) లో కాం గ్రెస్ నేతలు అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెడుతూ గెలవాలని చూస్తు న్నరు. ఇన్ని ప్రలోభాలు పెడుతు న్నా లొంగకుండా బీజేపీలో చేరిన నేతలను అభినందిస్తున్నా ఈ ఉత్సాహంతో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మురం చేస్తున్నాం. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తున్నాం. నాకు బాధేస్తోంది. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను నిలుపునా మోసం చేస్తోంది. వీటిపై ప్రశ్నిస్తే ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఆరో పణలు చేస్తూ చర్చను పక్కదా రి పట్టించే కుట్ర చేస్తున్నారు

ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలు. నరేంద్ర మోదీకి(Narendra Modi) రాహుల్ గాంధీకి మధ్య జరుగుతున్న ఎన్నికలివి. వీరిద్దరిని బేరీజు వేసుకోవాలని కోరుతున్నా. అదే సమయంలో 10 ఏళ్ల యూపీఏ పాలనను, 10 ఏళ్ల ఎన్డీఏ పాలనను బేరీజు వేయాలని కోరుతున్నా కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ 10 ఏళ్ల యూపీఏ పాలనలో రూ.12 లక్షల కోట్ల అవినీతి 2జీ స్కాం, బొగ్గు స్కాం, విమానాల స్కాం, కామన్ వెల్త్ గేమ్ స్కాం, ఆదర్శ స్కాంఐపీఎల్, గడ్డి కుంభకోణం, సహారా, ఈఎస్ఐ, హవాలా స్కాం,ఆఖరికి చెప్పుల స్కాం (ఫేక్ లెదర్ సొసైటీని ఏర్పాటు చేసి బ్యాంకుల నుండి వేల కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టిన వాళ్లను)లో వేల కోట్ల రుణం తీసు కుని ఎగ్గొట్టిన వ్యాపారులను సం కలో వేసుకుని తిరిగి నీచ చరిత్ర కాంగ్రెస్ దే.

దేశం పరువు తీసిన కాంగ్రెస్ పార్టీ నేతలా నీతులు చెప్పేది. గరీబీ హఠావో అనే నినాదంతో ముందుకొచ్చిన కాంగ్రెస్ నేతలు మాత్రమే అమీర్ లు అ య్యారు. పేదలు ఇంకా పేదరికం లోనే మగ్గుతున్నారు. గాంధీ కుటుం బానికే ఈ నినాదం పనికొచ్చిందే తప్ప ప్రజలకు ఏమాత్రం మేలు చేయలేదు. కానీ మోదీది అవినీతి మచ్చలేని స్వచ్ఛమైన పాలన అంది స్తున్నారు. ఈ దేశం కోసం పనిచేస్తు న్నరు. కుటుంబాన్ని పక్కనపెట్టి దేశ ప్రజలే తన కుటుంబంగా భావిస్తు న్నారు. అందుకే 140 కోట్ల మందికి గ్యారంటీ మోదీ మాత్రమేనని ప్రజ లు నమ్ముతున్నారు. అవినీతి, కుంభకోణాలు, వారసత్వ పాల నతో దేశాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ కు ఎక్స్పైరీ డేట్ వచ్చే సింది. జబ్బు వస్తే టాబ్లెట్లు వేసుకుం టాం. దానిమీద ఎక్సైరీ డేట్ ఉంట ది.

ఆ గడువు ముగిస్తే దానిని చెత్త కుప్పలో వేయాల్సిందే వందేళ్ల కాంగ్రె స్ బతుకంతా కుంభకోణాలు, లంబ కోణాలు, కుటుంబ రాజకీయాలే తప్ప ఏనాడూ ప్రజలను పట్టించు కున్న పాపాన పోలేదు. అందుకే జాతీయ కాంగ్రెస్ కాస్తా 2, 3 రాష్ట్రా లకే పరిమొతమై ప్రాంతీయ కాంగ్రెస్ గా మారింది. చివరకు ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయిన పార్టీ. పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections)తరువాత కాంగ్రెస్ ను బొంద పెట్టడం తథ్యం. పొరపాటున కాంగ్రెస్ కు ఓటేస్తే అవినీతికి ఓటేసినట్లే. కాంగ్రెస్ కు ఓటేస్తే దేశ భద్రతను గాలికొది లేసి నట్లే. కాంగ్రెస్ కు ఓటేస్తే కుటుంబ పాలనకు ఓటేసినట్లే.ఇగ కేసీఆర్ మళ్లా డ్రామాలు షురూ చేసిండు. మోదీ గారట ఆయనను అరెస్ట్ చేయాలని కుట్ర చేస్తున్నడట. ఆయన సుద్దపూస కాబట్టి అరెస్ట్ చేయలేకపోతున్నారట.

సిగ్గుండాలే నీ అవినీతి పుట్టలు బద్దలై ఎప్పుడు అరెస్టై జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందోనని భయంతో సీబీఐ రాకుండా ఉత్తర్వులు జారీ చేసి ఫాంహౌజ్ కే పరిమితమైన పిరికిపందవు నువ్వు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నీ అవినీతి, అరాచకాలను బయటకు తీసి అరెస్ట్ చేస్తుందనే భయంతో ఆ పార్టీతో కలిసి చీకటి కుట్రలు చేస్తున్న నీచుడు కేసీఆర్. సిగ్గులే కుండా తాను అమాయ కుడనని, సుద్దపూసనని నటించడమే కాకుం డా జీవిస్తూ మోస పూరితమైన మాటలు చెబుతున్నడు. నమ్మించి గొంతు కోసే పార్టీ బీఆర్ఎస్. కరీంనగర్ లో పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులూ నీ వాళ్లే. నీ నాణేనికి బొమ్మ, బొరుసు.

వాళ్లు ఎన్నడూ ప్రజల గురించి ఆలోచించలే. ఎన్నడూ కరీంనగర్ ప్రజలను కలవలే. కరీంనగర్ లో నీ ముఖం చెల్లకనే.. డబ్బులు పెట్టి కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులతో కలిసి నన్ను ఓడగొట్టడానికి కుట్రలు చేస్తున్నడు. సిగ్గు లేకుండా నాపై అవినీతి ఆరోపణలు చేస్తున్నరు. నేను సవాల్ చేస్తున్నా…నా అవినీ తి, ఆస్తిపాస్తులపై సీబీఐ విచారణ కు సిద్ధంగా ఉన్నా. మీరు కూడా మీ ఆస్తిపాస్తులపై, అక్రమ సంపాదనపై, బినామీల ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమా? ఇద్దరం కలిసి సీబీఐకి లేఖ రాద్దామా? నేను రడీ.. మీకు ఆ దమ్ముంటే లేఖ రాయాలని సవాల్ చేస్తున్నా. నా సవాల్ కు స్పందించాలి.

కరీంనగర్ లో కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెడుతూ గెలవాలని చూస్తున్నరు. ఇన్ని ప్రలోభాలు పెడుతున్నా లొంగకుండా బీజేపీలో చేరిన నేతలను అభినందిస్తున్నా దయచేసి కరీంనగర్ లో పోటీ చేస్తున్న మూడు పార్టీల అభ్యర్థులను బేరీజు వేయండి. నావి ప్రజా పోరాటాలు. వాళ్లది అవినీతితో ఆస్తులు పోగేసుకునే ఆరాటం ఎవరు ప్రజలకు అందు బాటులో ఉంటున్నారో ఎవరు ప్రజా సమస్యలపై కుటుంబాన్ని పక్కన పెట్టి అలుపెరగని పోరాటాలు చేస్తున్నారో. ఎవరు కరీంనగర్ ఓటు విలువను పెంచి దేశవ్యాప్తంగా కరీంనగర్ ప్రజలకు గౌరవాన్ని తీసుకొచ్చారో, ఎవరు ప్రజల ఆలోచించండి. తీర్పు ఇవ్వాలని కోరుతున్నా.

రేపు ఉదయం 8 గంటలకే నరేంద్రమోదీ వేముల వాడకు వస్తున్నారు. ఎములాడ రాజన్న ఆలయాన్ని దర్శించుకుం టారు. ఆ తరువాత 9 గంటలకు ఎములాడ బాలానగర్ కోర్టు వద్దనున్న మైదానంలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఎండలున్న నేపథ్యంలో బహిరంగ సభకు వస్తున్న వారి కోసం కూలర్లు, మజ్జిగ ప్యాకెట్లు, మంచి నీళ్లను అందుబాటులో ఉంచుతున్నాం. ఉదయం 8 గంటల వరకే ఎములాడలోని బాలానగర్ కోర్టు వద్ద గ్రౌండ్ జరిగే బహిరంగ సభకు తరలిరావాలని కోరుతున్నానని అప్పీల్ చేశారు.

CBI investigate corrupted properties