Bandi Sanjay kumar: రేవంతన్నా నా గుండుతో నీకేంపని
ముఖ్యమంత్రి రేవంతన్నా నేను ఆరు గ్యారంటీల సంగతేమైందని అడిగితే గుండు, అరగుండ అంటూ హేళనగా మాట్లా డుతున్నావు, ఐదేళ్లలో నేను చేసిన పోరాటాలు, కరీంనగర్ అభివృద్ధి, తెచ్చిన నిధులు నీ కళ్లకు కన్పించడం లేదా అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎదురుదా డి కి దిగారు.
నా పోరాటాలు,కరీంనగర్ అభి వృద్ధి కన్పించడం లేదా
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుండు సున్నాయే అని గుర్తుంచుకో
ఆరు గ్యారంటీల అమలు గాడిద గుడ్డు, గుండు సున్నా తెలుసు
దమ్ముంటే ఇచ్చిన హామీలు ఎందు కు అమలు చేయట్లేదో చెప్పాలి
ఢిల్లీలో టియర్ గ్యాస్, వాటర్ క్యాన్ వదిలినా తెలంగాణ కోసం గర్జించిన
సీఎం రేవంత్ వ్యాఖ్యలకు ధీటుగా ఎంపి బండి సంజయ్ కౌంటర్
ప్రజా దీవెన, సిరిసిల్ల: ముఖ్యమంత్రి రేవంతన్నా(CM Revanth Reddy )నేను ఆరు గ్యారంటీల సంగతేమైందని అడిగితే గుండు, అరగుండ అంటూ హేళనగా మాట్లా డుతున్నావు, ఐదేళ్లలో నేను చేసిన పోరాటాలు, కరీంనగర్ అభివృద్ధి, తెచ్చిన నిధులు నీ కళ్లకు కన్పించడం లేదా అంటూ బీజేపీ(BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎదురుదా డి కి దిగారు. సీఎం హోదాలో రేవం త్ రెడ్డి వాడుతున్న భాషను చూసి జనం అసహ్యించుకుంటున్నారని విమర్శించారు.
మీరెన్ని డ్రామాలా డినా, ఎదుటి మనిషులను ఎంతగా హేళన చేసినా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ వచ్చే సీట్లు గుండు సున్నా అని ఎద్దేవా చేశారు. మంగళవారం సిరిసిల్ల పట్టణoలో జరిగిన పార్టీ సమావేశంలో విచ్చేసిన బండి సంజ య్(Bandi Sanjay)పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జమ్మి కుంటలో నిర్వహించిన సీఎం బహి రంగ సభ అట్టర్ ఫ్లాఫ్ అయ్యిందని ప్రజలు కాంగ్రెస్ ను తిరస్కరిస్తున్నా రనడానికి ఇదే నిదర్శనమన్నారు.
ఎన్నికల్లో ఓడిపోతామనే భయం తో రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతూ అసభ్య పదజాలంతో తిడుతూ ప్రజల ద్రుష్టి లో మరింత చులకన అవుతున్నా రని చెప్పారు. జమ్మికుంటలో సీఎం రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయ్యిం దని, జనం లేక వెలవెలపోయిందని అన్నారు. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న నిరాసక్తతకు, తిరస్కరణకు నిదర్శ నమని వ్యాఖ్యానించారు.
జమ్మికుం ట సభలో సీఎం(CM)చేసిన వ్యాఖ్యలు తనను బాధ కలిగించాయని, ఆ యన ఉపయోగిస్తున్న భాష జుగు ప్సాకరమని, సీఎం హోదాలో ఉం టూ దిగజారి మాట్లాడటం సిగ్గు చేటన్నారు. మేధావి వర్గం, సామా న్య ప్రజలు సీఎం మాటలపై చర్చ జరుగుతోందని, సీఎంకు నా గుండు తో పనేంది, నాది అరగుండా గుం డా,అనేది నీకెందుకు, గాడిద గుడ్డు, అరగుండు, గుండు సున్నా అంటూ వ్యక్తిగతంగా కించపర్చడం సిగ్గు చేటన్నారు.
తెలంగాణలో(Telangana) నేను చేసిన పోరాటాలు, కరీంనగర్ లో నేను చేసిన పోరాటాలు కన్పించడం లేదా నా గుండు మాత్రమే నీకు కన్పి స్తుందా అని ప్రశ్నిస్తూ నువ్వెం త హేళన చేసినా పట్టిచుంకోనని స్పష్టం చేశారు. ఫస్టు ఆరు గ్యా రంటీల సంగతి చెప్పాలని, వంద రోజుల్లో మహిళల అకౌంట్లో ప్రతి నెలా రూ.2500 లు ఇస్తానన్నవుగా ఏమిచ్చినవ్, గాడిద గుడ్డు, గుండు సున్నా, రైతు భరోసా కింద రైతు లకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తా నన్న వ్, ఏమిచ్చినవ్ గాడిద గుడ్డు, గుండు సున్నా తప్ప అని సీఎం రేవంత్ పై ఎదురుదాడికి దిగారు.
వడ్లకు బోనస్ ఇస్తానన్నవ్, తులం బంగారం ఇస్తానన్నవ్, విద్యార్థు లకు రూ.5 లక్షల భరోసా ఇస్తాన న్నవ్. వ్రుద్దులకు రూ.4 వేల పెన్షన్ ఇస్తానన్నవ్, ఏమిచ్చినవ్ గాడిద గుడ్డు, గుండు సున్నా తప్ప అందు కే ఎన్ని కల్లో మీ పార్టీకి వచ్చేది గుండు సున్నా అని ఎద్దేవా చేశారు
మీకు దమ్ముంటే ఆరు గ్యారంటీ లపై చర్చించాలని, వాటిని ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు వివరిం చాలని, ఇప్పటికే హామీలను అమ లు చేయకపోవడంతో జనం తిరగ బడుతున్నా కాంగ్రెస్ నేతలకు బుద్ది రావడం లేదని అన్నారు.
కరీంనగర్(Karimnagar) కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరో కూడా ప్రజల కు తెలియదని, ఆయన ఏం మాట్లా డుతున్నరో ఆయనకే అర్ధం కావడం లేదని చెప్పారు. మేం శ్రీరాముడి గురించి మాట్లాడుతుంటే, దేవుడి పేరు చెప్పుకోవడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదన్న రేవంత్ రెడ్డికి దేవుడి మీద ఓట్టేసి రుణమాఫీ చేస్తానంటున్నడని, చివరకు ఆయ నకు దేవుడే దిక్కయ్యిండని, మేం పక్కా రాముడి వారసులమని, బరాబర్ మాట్లాడతామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ది ద్వంద్వ విధా నమని, మైనారిటీ డిక్లరేషన్ పేరుతో ఒక వర్గం ఓట్లు దండుకుంటున్నార ని, మీ మాదిరిగా తెలంగాణ ఉద్య మం చేస్తానంటే తుపాకీతో కాల్చే స్తానని నేను అనలేదని, ఢిల్లీలో టి యర్ గ్యాస్, వాటర్ వదిలినా వెను కంజ వేయకుండా జై తెలంగాణ అని గర్జించి గాండ్రించిన నాయ కుడిని నేను. ఎవరు ఎన్ని అవా కులు చవాకులు పేలినా తెలంగా ణలో అత్యధిక స్థానాలు బీజేపీ గెలవడం తథ్యం. కరీంనగర్ లో భారీ మెజారిటీ ఖయామని పునరుద్ఘాటించారు.
Congress defeat in lok sabha election