Praja Deveena
Newspaper Banner
Date of Publish : 22 March 2026, 2:52 pm Posted by : praja deveena

Congress SeniorLeader JeevanReddy : తెలంగాణ కాంగ్రెస్ లో ముసలం, సీనియర్ నేత జీవన్ రెడ్డి రాజీనా మాకు ముహూర్తం ఖరారు 

Congress SeniorLeader JeevanReddy : ప్రజా దీవెన, కరీంనగర్: తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో తెగతెంపులు చేసు కునేందుకు రంగం సిద్ధం చేసుకు న్నారు. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచల నం విషయంగా చర్చోపచర్చలు కొనసాగుతున్న తరుణం లో ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పే విషయంలో నిర్ణ యం తీసుకున్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజకీయ జీ వితంలో ఒక కీలక మలుపు తిరుగు తుందని తద్వారా భవి ష్యత్ రాజ కీయ మార్పులకు నాంది కావొచ్చన్న వాదన కొన సాగుతోoది.

నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌ తో కలిసి నడిచిన జీవన్ రెడ్డి అ క స్మాత్తుగా తన ప్రయాణాన్ని కొత్త దిశలోకి మళ్లిం చేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి గుడ్‌ బై చెప్పనున్నట్లు ప్రకటిస్తూ త న అనుచరులకు ఓ భావోద్వే గపూరిత లేఖను విడుదల చేశారు.గత 20 నెలలుగా పార్టీ లో జరుగుతున్న పరిణామాలు తనను తీవ్రంగా కలిచివేశా యని ఆయన పేర్కొన్నా రు. అవమానాలు, నిరాశలు, మా నసిక ఒత్తిడి మధ్య కొనసాగడం ఇక సాధ్యం కాదని స్పష్టం చేశారు.కానీ ఈ నిర్ణయం కేవలం విడిపో వ డమే కాదు ఇది కొత్త రాజకీయ ప్రయాణానికి సంకేతoగా నిలుస్తుంది.

జగిత్యాలలో ఈ నెల 25న జరిగే కీ లక సమావేశం ఇప్పు డు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అక్కడే జీవన్ రెడ్డి తన భ విష్యత్ రాజకీయ అడుగులపై స్పష్టత ఇవ్వనున్నారు. ఆ యన ఏ దిశలో ముందుకు వెళ్తా రు, కొత్త పార్టీనా, లేక స్వ తంత్ర పో రాటమా అన్నది ఆసక్తికరంగా మారిందని చర్చ జోరుగా సాగుతోంది.తన మద్దతుదారులను ఉద్దేశించి, “మీ సూచనలు, మీ అండదండలే నా భవిష్యత్‌కు దారి చూపా లి” అని కోరడం కూడా ఆయన ముందున్న మార్గం ఇంకా ఓ పెన్‌గా ఉందని సూచిస్తోంది.

ఇప్పుడిదంతా చూస్తుంటె ఇది ఒక రాజీనామా కంటే ఎక్కు వని, ఇది తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొద లయ్యే సంకేతమా అనే ప్రశ్నకు సమాధానం కోసం అం ద రూ ఎదురుచూస్తున్నారు. మొత్తానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో తన కంటూ ప్రత్యేక స్థానం సంపాదించు కున్న జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో చేస్తున్న జీవనయానం ఎట్టకేలకు ముగియ నుంది. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఎటు ఎలాంటి దారి తీస్తాయోనన్న ఆసక్తి రాజకీయవర్గాల్లో తారా స్థాయి కి చేరుకుంది.