Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bandi Sanjay kumar: కల్లాల్లో రైతు కష్టాలు పాలకులకు పట్టవా

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల రాష్ట్ర రైతాం గం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొం టోందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు.

తాలు, తరుగు, తేమ లేకుండా వడ్లను ఎందుకు కొనడం లేదు
అన్ని రకాల వడ్లకు రూ.500ల బోనస్ ఇవ్వాల్సిందే
పంట నష్టపరిహారం ఎందుకి వ్వడం లేదు
రేపటి కేబినెట్ లో రైతులను ఆదు కునేలా నిర్ణయాలు తీసుకోవాలి
రైతుభరోసా, రుణమాఫీలతో రైత న్నను ఆదుకోవాలి
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్

 

ప్రజా దీవెన, కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల రాష్ట్ర రైతాం గం(farmers) తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొం టోందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్(Bandi sanjay kumar) విచారం వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవ డంలో విపలమైన ప్రభుత్వం పం డించిన వడ్లను సైతం సకాలంలో కొనుగోలు చేయకుండా తీవ్ర జా ప్యం చేస్తుండటంతో కొనుగోలు కేం ద్రాల వద్ద రైతులు నిద్రాహారాలు మాని పడిగాపులు కాస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదారు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ ముందస్తు సమాచారమిచ్చి నప్పటికీ ప్రభుత్వం మాత్రం కల్లాల వద్ద వడ్ల కొనుగోలును వేగవంతం చేయకపోవడంతోపాటు కొనుగోలు కేంద్రాలవద్ద వడ్లు తడవకుండా కనీస సౌకర్యాలు కల్పించకపోవడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు.

దీంతో ప్రతిరోజు వానకు పదే పదే వడ్లు తడిసిపోవడం, తిరిగి వాటిని అరబెట్టేందుకు రైతులు తిండి తిప్ప లు మాని అష్ట కష్టాలు పడాల్సిన రావడం అత్యంత బాధాకరమన్నా రు కొన్ని చోట్లు అన్ని ఇబ్బందులను అధిగమిస్తూ అన్నదాతలు వడ్లను ఆరబెట్టినప్పటికీ సకాలంలో వాటిని కొని, వారికి విముక్తి కలిగించే నాథు డే కరువయ్యారు. తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా కనీస మద్దతు ధర చెల్లించి ధాన్యాన్ని కొను గోలు చేయాలని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన ప్పటికీ, క్షేత్ర స్థాయిలో ఆదేశాలకు అనుగుణంగా జరుగుతున్న దాఖ లాలే లేకపోవడం విచారకర మన్నా రు తాలు, తరుగు, తేమ పేరుతో క్వింటాలుకు 5 నుండి 10 కిలోలు కోత పెడుతూ రైతుల కష్టాన్ని దోచు కుంటున్నారు.

ఇచ్చిన హామి ప్రకా రం కనీస మద్దతు ధర(Support price) కూడా ఇవ్వకుండా క్వింటాలుకు రూ.200 నుండి రూ.500 ల వరకు రైతులు నష్టపోతున్నారు. క్షేత్రస్థాయి పరిస్థి తులను గమనిస్తే, సీఎం ఆదేశాలు ప్రకటనలకే పరిమితమయ్యాయని తెలిసిపోయింది.అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం పేపర్ పై రాసిచ్చిన హామీలను పట్టించుకున్న పాపాన పోలేదు. కాంగ్రెస్ గెలిచాక, కల్లాలకు రెండో పంట వచ్చినా క్వింటాలుకు రూ.500ల బోనస్ హామీకి దిక్కు లేదు. బోనస్ ఇవ్వకపోగా సన్న వడ్లకే రూ.500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇటీవల వార్తలు రావడం, దొడ్డు రకం వడ్లనే పండించిన అత్యధిక శాతం రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

దీనిపై రైతాంగానికి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో వడ్ల కొనుగోలు సగానికిపైగా పూర్తయినట్లు మా దృష్టికి వచ్చింది. కొనుగోలు చేసిన వడ్లకు సైతం సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బంది పడుతున్నారు. క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని వడ్లు కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు చెల్లించాలని కోరుతున్నాం. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు వడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వాలి. తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా వడ్లను కొనుగోలు చేసి కనీస మద్దతు ధర చెల్లించాలని, తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా కనీస మద్దతు ధరకు వడ్ల కోనుగోలు చేయాలని బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మరో ముఖ్య మైన అంశమేమిటంటే యాసంగిలో అకాల వర్షాలతో ప్రతిఏటా రైతులు నష్టపోతూనే ఉన్నా నష్ట పరిహారం అందించడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంతోపాటు ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమ య్యా యి.

కరీంనగర్ పార్లమెంట్ నియో జకవర్గ(Karimnagar Parliament) పరిధిలో యాసంగి సీజన్ లో కురిసిన అకాల వర్షాలతో వరి, మొక్కజొన్న, మామిడి పంట నష్టం జరిగినా నేటికీ పరిహారం అంద నేలేదు. ఒక్కో రైతు సగటున ఎకరానికి రూ.20 వేల పెట్టుబడి పెట్టారు. కౌలు రైతులపై అదనంగా మరో రూ.10 వేల భారం పడింది. వీరందరికీ కనీసం పంటల బీమా పథకాన్ని కూడా వర్తింపజేయడం లేదు. ప్రభుత్వ సాయం అందక, చేసిన అప్పులు తీరక జిల్లా రైతాం గం దిక్కుతోచని స్థితిలో ఉంది. వారి దుస్థితిని సహృద యంతో అర్థం చేసుకుని యుద్ద ప్రాతిపదికన నష్ట పరిహారం అందించాలని బీజేపీ పక్షాన కోరుతున్నాం.

అట్లాగే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రైతు భరోసా కింద రైతులు, కౌలు రైతులకు ఒక్కో ఎకరాకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు చెల్లిస్తామని హమీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి సుమారు 6 నెలలైనా రైతు భరోసా కింద రైతుకు సాయం అందలేదు. రూ.2 లక్షల రుణమాఫీ కాలేదు. పండించిన పంటకు డబ్బులు రాక, ప్రభుత్వం నుండి సాయం అందక, చేసిన అప్పులు తీరక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

దీనికితోడు వానాకాలం సీజన్ ప్రారంభం కాబోతోంది. వ్యవసాయానికి పెట్టుబడి లేక, బ్యాంకుల నుండి కొత్త అప్పులు పుట్టక రైతులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ఈ తరుణంలో రేపు(సోమవారం) జరగబోయే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడంతోపాటు వారికి ఉపశమనం కలిగేలా నిర్ణయాలు తీసుకుని యుద్ద ప్రాతిపదికన వాటిని అమలు చేయాలి. ముఖ్యంగా రాబోయే నాలుగైదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో కల్లాల వద్ద ఉన్న వడ్లను పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేలా అధికారులకు ఆదేశాలిచ్చి రైతులను ఆదు కోవాలని బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

farmers facing crisis due Congress negligence