Bandi sanjay: హిందువులు ఐక్యత చాటారు
కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో హిందువులు ఐక్యత చాటారని, హిందువులు ఏకమైతే ఫలితాలు ఎలా ఉంటా యో నిరూపించారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు.
లోక్ సభ ఎన్నికల్లో ఐక్యత ఎలుగె త్తిచాటారు
జూన్ 4న కేసీఆర్ డాక్టర్లను పక్కన బెట్టుకోవాలి
ఇచ్చిన గ్యారెంటీ ల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించాలి
మీడియా సమావేశంలో కరీంనగ ర్ ఎంపీ బండి సంజయ్
ప్రజా దీవెన, కరీంనగర్: కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో(Parliament elections)హిందువులు ఐక్యత చాటారని, హిందువులు ఏకమైతే ఫలితాలు ఎలా ఉంటా యో నిరూపించారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్(MP Bandi Sanjay)అన్నారు. మొత్తా నికి లోక్ సభ ఎన్నికల్లో హిందు వులు తమ ఐక్యతను ఎలుగెత్తి చాటారని కొనియాడారు. మంగళ వారం కరీంనగర్లో ఆయన మీడి యాతో మాట్లాడారు. కరీంనగర్ లో బీజేపీని ఓడించేందుకు ముస్లిం లంతా ఏకం కావాలంటూ కేసీఆర్(KCR) పిలుపునిచ్చారని, హిందువులంతా ఏకమైతే ఏ విధమైన ఫలితాలు వస్తాయో జూన్ 4న తేలుతుంద న్నారు.
ఫలితాలను చూసి తట్టు కునే శక్తి కేసీఆర్ కు ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఆ రోజు కేసీఆర్ ఇద్దరు డాక్టర్లను పక్క న పెట్టుకోవాలని సూచించారు. కాంగ్రెస్(Congress) నాయకులు ఎన్ని అడ్డదా రులు తొక్కినా ప్రజలు బీజేపీ(BJP) పక్షాన నిలిచారని చెప్పారు. ఉన్న తాధికారులు సక్రమంగా పనిచేసి నా కొన్ని ప్రాంతాల్లో కింది స్థాయి పోలీ సులు అత్యుత్సాహం ప్రద ర్శించారని అన్నారు. బీజేపీ కార్యక ర్తలను అదుపులోకి తీసుకున్నా రని, లాఠీచార్జ్ లు సైతం చేశారని మండిపడ్డారు.
గతంలో బీఆర్ఎస్(BRS) కు పోలీసులు ఎలా సహకరించారో అదే విధంగా కాంగ్రెస్ కు కొంత మం ది పోలీసులు సహకరించారని ఆరో పించారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యం గా కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్లు అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని చెప్పారు. కాంగ్రె స్ ఇచ్చిన హామీలను అమలు చేస్తే పూర్తి స్థాయిలో సహకరిస్తామని లేకపోతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నాయకత్వంలో క్షేత్ర స్థాయిలో ఉద్యమాలు తప్పవని సంజయ్ హెచ్చరించారు.
Hindus united in parliament elections