Karimnagar SI Chandrasekhar Suicide : ప్రజా దీ వెన, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో హృదయాలను కలి చివేసే విషాద ఘటన చోటుచేసుకుంది. టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్ఐ చంద్రశేఖర్ జీవితంలో వరుసగా చోటుచేసుకున్న దుర్ఘటనలు చివరకు ఆయనను తీవ్రమైన నిర్ణ యానికి దారితీశాయి.ఇటీవల ఆ యన భార్య దివ్య గ న్నేరుపప్పు తిని ఆత్మహత్య చేసుకోవడం కుటుంబాన్ని శోక సంద్రంలో ముంచేసింది. భార్య మృతితో తీవ్ర మనస్తాపానికి గురైన చంద్రశేఖర్, అంత్యక్రియల అనంతరం ఆమె స్వగ్రా మం సీతం పేటలో ఉంటూ తీవ్ర మానసిక వేదన అనుభవి స్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఆ బాధను తట్టుకోలేక అత్తగారింట్లోనే ఉరివే సుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘ టన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. చంద్రశేఖర్ మృత దేహాన్ని జమ్మికుంట ప్ర భుత్వ ఆసుపత్రికి తరలించి, పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ సంఘ ట నతో పోలీస్ వర్గాలు, స్థానిక ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గుర య్యారు. కుటుంబంలో వరు సగా జరిగిన ఈ విషాదాలు అందరినీ కలచివేస్తున్నాయి.
కరీంనగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా వి ధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కేవలం కొన్ని రోజుల వ్యవ ధిలోనే భార్యాభర్తలిద్దరూ తనువు చాలించడం ఆ కుటుం బాన్ని కోలుకోలేని దెబ్బతీసింది.అంత్యక్రియల అనంతరం ఆయన భార్య స్వగ్రా మమైన సీతంపేటలోనే ఉంటున్నా రు.
భార్య జ్ఞాపకాల నుండి బయటపడలేక, ఆమె లేని జీవితం వృధా అ ని భావించిన ఆయన తన అత్తగారింట్లోనే ఉరివే సుకుని ప్రాణాలు వి డిచారు. ప్రస్తుతం ఎస్ఐ చంద్రశేఖ ర్ మృత దేహాన్ని పోస్టుమార్టం ని మిత్తం జమ్మికుంట ప్రభుత్వ ఆసు పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు న మోదు చేసుకు ని దర్యాప్తు చేస్తున్నారు. ఒక నిబద్ధత గల అధికారి ఇలా అర్ధాంతరంగా తనువుచాలించడంతో పో లీ స్ శాఖలోనూ విషాదఛాయలు అలముకున్నాయి.
ఆత్మహత్య దేనికీ పరిష్కారం కా దని, మీకు ఎలాంటి మాన సిక ఒత్తిడి లేదా ఇబ్బందులు ఉన్నా వెంటనే నిపుణులను సంప్రదించాలని స హాయం కోసం ఆసరా (Aasra) వంటి హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చని మానసిక నిపుణు లు సూచిస్తున్నారు.