Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bandi Sanjay kumar: నమ్మించి గొంతు కోసే రకం కేసీఆర్

రాష్ట్రాన్ని పదేళ్ళు పరిపాలించిన మాజీ సీఎం కేసీఆర్ నమ్మించి గొంతు కోసే రకమని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు

మళ్లీ డ్రామాలాడి ఓట్లు దండుకు నేందుకు మీ ముందుకొస్తున్నడు
పదేళ్ళలో కేసీఆర్ చేసిన మోసాలను గుర్తు చేసుకోండి
సోషల్ మీడియాతో సోకాల్డ్ మేధా వులతో కేసీఆర్ ప్రచారాన్ని నమ్మ కండి
కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులు చెల్లించేందుకు ఢిల్లీకి కప్పం కడు తున్న కాంగ్రెస్
ఆరు గ్యారంటీలను అమలు చే సేందుకు డబ్బుల్లేవనడం సిగ్గు చేటు
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు
కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో వాకర్స్ ను కలిసి ఓట్లు అభ్యర్ధిం చిన బండి సంజయ్
మా మద్దతు మీకేనంటూ మోదీ యే మళ్లీ ప్రధాని కావాలంటున్న వాకర్స్

ప్రజా దీవెన, కరీంనగర్: రాష్ట్రాన్ని పదేళ్ళు పరిపాలించిన మాజీ సీఎం కేసీఆర్(KCR) నమ్మించి గొంతు కోసే రకమని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ డ్రామాలాడి ఓట్లు దండుకునేం దుకు మీ ముందుకొస్తున్నడని, అ డ్డం పొడుగు మాటలు మాట్లాడి అరచేతిలో వైకుంఠం చూపే హామీ లతో ఊరించి ఊరించి మాట్లాడు తూ ఓట్లు దండుకునేందుకు సిద్ద మైండని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజ లకు, కరీంనగర్ ప్రజలకు విజ్ఝప్తి చేసే దొక్కటే పదేళ్లలో కేసీఆర్ చేసి న మోసాలను, పాపాలను గుర్తు చేసుకోవాలని, రైతులు, నిరుద్యోగు లు, విద్యార్థులు, ఉద్యోగ, ఉపాధ్యా యులు సహా అన్ని వర్గాలను రాచి రంపాన పెట్టిన సంఘటనలను, ప్రశ్నించే గొంతులను నులిమి ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేసిన విష యాన్ని గుర్తు చేసుకోవాలని కోరా రు.

అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల అమలు పేరుతో చేసిన మోసాన్ని స్మరించుకోండి, రెండు పార్టీలను బొందపెట్టి గుణ పాఠం చెప్పండని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ ఎన్నికల(Parliament elections) ప్రచారంలో భాగంగా బండి సంజయ్ ఆదివారం కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడి యానికి విచ్చేసి వాకర్స్ ను కలిశారు. మోదీ ప్రభుత్వం చేసిన అభివ్రుద్ధి, సంక్షేమ పథకాలతో పాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసిన కృషిని వివరిస్తూ ఓట్లను అభ్యర్ధించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ను కలిసేందుకు, ఫోటోలు దిగేందుకు వాకర్స్ పోటీ పడ్డారు. మళ్లీ మోదీయే ప్రధాని కావాలన్నదే తమ అభిమతమని, బీజేపీకే మద్దతిస్తామని బాహాటంగానే వాకర్స్ ప్రకటించారు.

తెలంగాణ ప్రజల పక్షాన, కరీంనగర్ కోసం బండి సంజయ్ ఎన్నో పోరాటాలు చేశారని, బండి సంజయ్(Bandi sanjay kumar) ను బంపర్ మెజారిటీతో గెలిపిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారందరికీ క్రుతజ్ఝతలు తెలిపిన బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అంబే ద్కర్ స్టేడియంలో వాకర్స్ ను కలిసి మోదీ ప్రభుత్వం చేసిన అభివ్రుద్ధి, సంక్షేమ పథకాలతో పాటు కరీంనగ ర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ గా చేసిన అభివ్రుద్ధి, ఖర్చు చేసిన నిధులను వివరిస్తూ ఓట్లు అభ్యర్ధి స్తున్నాను. వాకర్స్ అంతా మోదీకి ఓటేస్తామని, నన్ను ఎపీంగా గెలిపి స్తామని చెప్పడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుండటంతో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మళ్లీ వంచించి ఓట్లేయించుకు నేందుకు కుట్రలు ఆరోపించారు. కొంతమంది సోకాల్డ్ మేధావులతో సోషల్ మీడియా ద్వారా కేసీఆరే బెటర్ అనేలా ప్రచారం చేస్తూ ప్రజ లను నమ్మించే ప్రయత్నం చేయిస్తు న్నారని, ఒక్కసారి కేసీఆర్ చేసిన మోసాల ను గుర్తుంచుకోండo అనివార్యమని అన్నారు. వడ్ల కుప్పలపై గుండె పగిలి చనిపోతే స్పందించలేదని, గత ఎన్నికలకు ముందు కూడా ఎకరాకు రూ.10 వేలు ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేశారని ఇక్కడి రైతులను ఆదు కోకుండా పంజాబ్ పోయి అక్కడి రైతులకు పైసలిచ్చి ప్రచారం చేసుకున్నడని, తెలంగాణను ఏటీఎంగా వాడుకున్నాడని, కుటుంబానికి వేల కోట్ల రూపా యలు దోచిపెట్టిండని, విద్యార్థుల ఆత్మహత్యలకు కారకుడైండని ధ్వజమెత్తారు.

నిరుద్యోగులు బతుకులతో చెలగాటమాడుతూ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ చేయించి 30 లక్షల నిరుద్యోగుల బతుకులను రోడ్డున పడేసిండని, ప్రశ్నిస్తే లాఠీల తో కొట్టించిండని, అరెస్టులు, కేసు లు, జైళ్లతో నానా గోస పెట్టిండని, చివరకు ఫోన్ ట్యాపింగ్ తో భార్యా భర్తలు ఫోన్లు కూడా మాట్లాడలేని తీసుకొచ్చిండని, చివరకు ఫీజు రీయంబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ బకాయిలివ్వకుండా విద్యార్థులను, ప్రజలను నానా గోస పెట్టిండని, కబ్జాలు, దోపిడీ, అరాచకాలతో ప్రజల బతుకులను నాశనం చేసిం డని, ఇంకా ఏ ముఖం పెట్టు కుని కేసీఆర్ ఓట్లు అడగడానికి వస్తు న్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీకి పోయి రోజా పెట్టిన చేపల పులుసు తిని క్రిష్ణా నీటిని దోచిపెట్టిండని, ప్రజలు కేసీఆర్ మోసాలను, బీఆర్ఎస్ అభ్యర్ధుల దుష్ప్రచారాన్ని నమ్మొ ద్దని కోరుతున్నామని చెప్పారు.

కరీంనగర్ లో కాంగ్రెస్ నేతలు అసెం బ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల ను పూర్తిగా విస్మరించి మళ్లీ ఓట్ల కోసం డ్రామాలాడుతున్నరని కాంగ్రెస్ అనుకూల కాంట్రాకర్లకు వేల కోట్ల బిల్లులు చెల్లించడానికి నిధులుంటాయని, ఢిల్లీకి కప్పం కట్టడానికి నిధులుంటాయని, తెలం గాణ సొమ్మును దేశవ్యాప్తంగా ఎన్ని కల ప్రచారానికి ఉపయోగించడా నికి డబ్బులుంటాయని, కానీ ప్రజల కు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి డబ్బుల్లేవంటారా, పార్ల మెంట్ ఎన్నికల్లో(Parliament elections) ఫోన్ ట్యాపింగ్(Phone tapping) ప్రధాన నిందితుడు పంపే సొమ్ముతో కరీంనగర్ లో కార్పొరేటర్లను, ప్రజా ప్రతినిధులు కొంటున్నారని అందు కోసం ఆ నిందితుడు వియ్యంకుడి తో కలిసి ఓ వ్యాపారవేత్త, మాజీ ప్రజాపత్రినిధి కార్పోరేటర్లను, ప్రజా ప్రతినిధులను కొంటున్నారని ఆరోపించారు. కబ్జాలు చేసి వాళ్ల మాదిరిగానే ఫోన్ ట్యాపింగ్ నిందితులంతా అరెస్ట్ కావడం తథ్యమని, పొరపాటున ఎవరైనా పైసలు తీసుకుంటే వారు కూడా ఇబ్బందుల్లో పడతారని నోటీసు లొస్తాయని ఆలోచించి ఓటేయాలని కోరారు. మోసాలు, దోపిడీలు చేస్తూ ఓట్లు అడగడానికి వస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను బొందపెట్టాలని విజ్ఝప్తి చేశారు.

KCR fraud telangana people says bandi