Revanth Reddy:గుజరాత్ పెత్తనం, తెలంగాణ పౌరుషo మధ్య పోరాటం
దేశంలో గుజరాత్ పెత్తనం కొనసాగుతుంద ని వ్యాఖ్యానించారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా గుజరాత్ పెత్తనానికి తెలంగాణ పౌరుషానికి మధ్య పోరు కొనసాగు తుందని పేర్కొన్నారు.
ప్రధాని మోదీ తెలంగాణకు ఇచ్చింది, చేసింది గాడిద గుడ్డే
కెసిఆర్ ను ఇండియా కూటమి లోకి రానిచ్చే పరిస్థితి లేదు
పన్నెండు సీట్లు గెలిస్తే బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందంట
కేసీఆర్ ఇకపై జీవితంలో మళ్ళీ పదవిని కళ్లతో చూడలేవు
కరీంనగర్ రోడ్ షోలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి
ప్రజా దీవెన, హైదరాబాద్: దేశంలో గుజరాత్ పెత్తనం కొనసాగుతుంద ని వ్యాఖ్యానించారు. లోక్ సభ ఎన్నికల్లో(Lok Sabha elections) తెలంగాణ వ్యాప్తంగా గుజరాత్ పెత్తనానికి తెలంగాణ పౌరుషానికి మధ్య పోరు కొనసాగు తుందని పేర్కొన్నారు. తెలంగాణ పౌరుషాన్ని గుజరాత్‌కు చేరే విధం గా చాటాలని పిలుపునిచ్చారు. బీజేపీ(BJP) వాళ్లు సూరత్‌కు పారిపోయే విధంగా తీర్పు ఇవ్వాల్సిన అవస రం ఉందన్నారు. పదేళ్ల పాలనలో తెలంగాణకు మోదీ ఇచ్చింది ఏం లేదని, కరీంనగర్ ఎంపీ బండి సంజ య్ తెచ్చిందేమిలేదని ఆగ్రహం వ్య క్తం చేశారు.
లోక్‌సభ ఎన్ని కల ప్ర చారంలో భాగంగా ఆయన మం గళవారం కరీంనగర్ (Karimnagar) జిల్లా జమ్మి కుంటలో, భూపాలపల్లి జిల్లా రేగొండలో జరిగిన జనజాతర సభ ల్లో, హైదరాబాద్‌లోని బాలా పూర్, ఎన్టీఆర్‌నగర్‌లో నిర్వహించిన రోడ్‌షోల సందర్భంగా ప్రసంగిం చారు. 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్ష ను, 1200 మంది తెలంగాణ బిడ్డల బలిదానాలను అవమాన పరిచే విధంగా మోదీ పార్లమెంట్‌లో మాట్లాడితే ఎంపీగా ఉన్న బండి సం జయ్ ఏం మాట్లాడకుండామౌనంగా ఎందుకు ఉన్నారో చెప్పా లని ప్రశ్నించారు.
కేసీఆర్‌ను(KCR) ఇండియా కూటమిలోకి రానివ్వబోమని ఆయన ఇంటి మీద వాలిన కాకి కాంగ్రెస్ గోడ మీద వాలినా కాల్చి వేస్తామని రేవంత్‌రెడ్డి(Revanth Reddy) హెచ్చ రిం చారు. కేసీఆర్ బీజేపీతో చీకటి ఒప్పందం కుదుర్చుకుని కాంగ్రెస్‌ను ఓడించేందుకు కుట్ర పన్నుతున్నా రని ఆరోపించారు. అందుకే ఆయన ఖమ్మం సభలో కాంగ్రెస్‌కు ఈ ఎన్ని కల్లో 40 సీట్లు రావని, బీజేపీకి 200 సీట్లలోపే వస్తాయని, రాష్ట్రంలో తమకు 12 సీట్లు ఇస్తే సంకీర్ణంలో చేరి నామాను కేంద్రమంత్రి చేస్తా మని అన్నారని దుయ్యబట్టారు.
బీఆర్‌ఎస్‌కు(BRS) 12 సీట్లు వస్తే కేంద్రం లో అధికారంలోకి వస్తుందా అని రేవంత్ ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో అప్పట్లో పేదోళ్ల బిడ్డ అని, గుండో, అరగుండో అని బండికి ప్రజలు ఓటేశారని, నిజామాబాద్ గుండు గానీ, కరీంనగర్ అరగుండు గానీ తెలంగాణకు తెచ్చింది ఏమి లేదని విమర్శించారు. మోదీ జాతీయ ప్రాజెక్టు ఇవ్వలేదని, ఐటీఐఆర్, కారిడార్ ఇవ్వలేదని, రాష్ట్రానికి ఆయన ఇచ్చింది గాడిద గుడ్డు అని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన సభకు హాజరైన ప్రజలకు గాడిద గుడ్డు అన్ని రాసి ఉన్న ఓ వస్తువును చూపించారు.
కర్ణాటకకు చెంబు, ఏపీకి మట్టి, చెంబెడు నీళ్లు ఇచ్చి తెలంగాణకు(Telangana) గాడిదగుడ్డు ఇచ్చారని ఎద్దేవా చేశారు. అయో ధ్య రాముడి కల్యాణానికి 15 రోజు ల ముందే ఊరూరా అక్షింతలు పంపిణీ చేశారని, కల్యాణం జరక్క ముందే అక్షింతలు ఎక్కణ్నుంచి వచ్చాయని రేవంత్ ప్రశ్నించారు. హిందూ సంప్రదాయాలను దెబ్బ తీసేలా ముందస్తుగా అక్షింతలను పంచి శ్రీరాముడిని అవమానిం చారని మండిపడ్డారు.దేవుడు గుడిలో, భక్తి గుండెల్లో ఉండాలని.. కానీ గుండు, అరగుండు బజార్లలో, బస్టాండ్లలో దేవుడి బొమ్మపెట్టి చిల్ల ర పైసలు అడుక్కున్నట్లు ఓట్ల ను అడుక్కుంటున్నారని విమర్శిం చారు.
అంబేడ్కర్ (Ambedkar)రూ పొందించిన రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పిం చిందని రేవంత్ గుర్తు చేశారు. బీ జేపీ మళ్లీ గెలిస్తే దళితులు, గిరి జనులు, బీసీలపై సర్టికల్ స్ట్రైక్ చేసి రిజర్వేషన్లను రద్దు చేస్తుందని హెచ్చరించారు. రిజర్వేషన్లను ఎందుకు రద్దు చేయాలనుకుం టున్నారో ఈ గడ్డపైకి వస్తున్న మోదీ(Modi) చెప్పాలని డిమాండ్ చేశారు. తన కోసం ఢిల్లీ పోలీసులు వస్తున్నారని పదేళ్లు కేసీఆర్ ఇదే విధంగా ఏసీబీ పోలీసులు, విజిలెన్స్‌తో తనను వేధించి కేసులు పెట్టి జైలుకు పంపి స్తే చివరి ఏమైందని, నడుము విరిగి కేసీఆర్ మూలకుపడ్డారన్నారు.
కేసీ ఆర్, కేటీఆర్(KTR) కారు ఖరాబైందని, షెడ్డుకు పోయిన ఆ కారు మళ్లీ రాదని, తూకం వేసి అమ్మాల్సిందేన ని ఎద్దేవా చేశారు. మహబూబ్‌న గర్, చేవేళ్ల, మల్కాజిగిరి, భువన గిరి, జహీరాబాద్, కరీంనగర్, నిజా మాబాద్ సీట్లలో బీజేపీని గెలి పిం చేలా ఖమ్మం, నల్లగొండ, మెదక్‌లో బీఆర్‌ఎస్‌ను గెలిపించేలా ఆ పార్టీల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. ఆగస్టు 15లోపు రైతులకు రుణమాఫీ చేస్తానని, వేములవాడ రాజన్న సాక్షిగా చెబుతున్నానన్నారు.
KCR on entry in INDIA alliance