–ఒవైసీ సహా ఎవరెన్ని అడ్డంకులు
సృష్టించినా ఆగే ప్రసక్తే లేదు
–అతి త్వరలోనే పార్లమెంట్ ఆ మోదం అనివార్యం
— దేశద్రోహ మజ్లిస్ మతం కోణం లో అడ్డుకుంటే ప్రజలే చూస్తారు
–దేశం కోసం కఠిన నిర్ణయాలు తీ సుకునేందుకు వెనుకాడబోం
— దేశ ప్రజల ఆస్తిపాస్తులను కాపా డాల్సిన బాధ్యత మాపై ఉంది
–కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
Minister Bandi Sanjay Kumar : ప్రజా దీవెన కరీంనగర్: భారత రా జ్యాంగానికి భవిష్యత్‌లో ఆర్‌ఎస్ ఎస్ భావజాలంతోనే ముప్పు పొం చి ఉందంటూ మజ్లిస్ అధినేత అ సదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిప డ్డారు. మజ్లిస్ పార్టీయే అసలైన దేశద్రోహ పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం జాతీ యవాద భావజాలంతో పని చేస్తోం దన్నారు. వక్ఫ్ బోర్డు బిల్లు పై దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోందన్నా రు. ఒవైసీసహా కుహానా లౌకిక వా దులు ఎంత అడ్డుకున్నా పార్ల మెంట్ లో అతి త్వరలోనే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఆమోదం పొందుతుందని స్పష్టం చేశారు. దేశం ప్రజల కోసం మోదీ ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీ సుకు నేందుకు వెనుకాడబోదని ఉద్ఘా టించారు.
శనివారం కరీంనగర్ లోని జిల్లా కో ర్టు కాంప్లెక్స్ లోని న్యాయవాదుల డిజిటల్ లైబ్రరీ కోసం బండి సంజ య్ రూ.15 లక్షలు మంజూరు చే శారు. ఈ సందర్భంగా న్యాయవా దులంతా బండి సంజయ్ ను సన్మా నించారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన కార్యక్రమంలో గ్రాడ్యు యేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, బార్ అసో సియేషన్ అధ్యక్షులు రాజ్ కుమా ర్, కార్యదర్శి బేతి మహేందర్, బా స సత్యనారాయణ, కోమాల ఆం జనేయులు తదితరులు హాజరై ప్ర సంగించారు. అనంతరం బండి సం జయ్ ప్రసంగం ఆయన మాటల్లో నే..
ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసి కేసులు ఎదుర్కొన్న. 109 కేసులు నాపై ఉన్నాయి. పలు మార్లు జైలుకు పోయిన. ప్రతిసారి నన్ను కాపాడుతోంది న్యాయవాదు లే. వారి సంక్షేమం కోసం అన్ని విధాలా సహకరిస్తా. న్యాయవాదు ల కాన్ఫరెన్స్ కోసం సీఎస్సార్ ఫం డ్స్ నుండి మరో రూ.50 లక్షల సా యం చేసేందుకు నావంతు క్రుషి చేస్తా.
వక్ఫ్ బోర్డు బిల్లు పై మజ్లిస్ నేత ఒవైసీ అడ్డగోలుగా మాట్లాడుతున్న డు. దేశమంతా వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు పలుకుతున్నరు. ఒవైసీ లాంటి ఎంత మంది వచ్చినా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆగదు. పార్ల మెంట్ లో ఆమోదించి తీరుతాం.
ఈ దేశ ప్రజల ఆస్తిపాస్తులు కాపా డాల్సిన బాధ్యత మాపై ఉంది. వ క్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై అందరి అభిప్రాయాలు తీసుకున్నాం. దేశ మంతా తిరిగి అభిప్రాయాలను సేక రించాం. పార్లమెంట్ సంఘం సమా వేశమై నివేదిక కూడా సమర్పించిం ది. అతి త్వరలో వక్ఫ్ బోర్డు సవర ణ బిల్లు ఆమోదం పొందడం త థ్యం. మతం కోణంలో ఆలోచించి దీనిని అడ్డుకోవడం సరికాదు. అలాంటి వారిపై ప్రజలు తిరగబడే ప్రమాదం ఉంది.
వక్ఫ్ బోర్డు పేరు తీరుతో పేదలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసు. ఈ కరీంనగర్ లోనే ఓ పేద వ్యక్తి తరతరాల నుండి ఇం టిని నిర్మించుకున్నరు. వాళ్ల తాత, ముత్తాతలు ఆ ఇంట్లోనే ఉంటు న్నారు. కానీ వక్ఫ్ బోర్డు స్థలమని చెప్పి అనుమతులన్నీ రద్దు చేసి ఇబ్బంది పాల్జేశారు. ఇలాంటివి దేశవ్యాప్తంగా ఉన్నాయి. అందుకే దేశ ప్రజలను, ఆస్తిపాస్తులను కాపా డాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉం దని సవరణ బిల్లు రూపొందించాం.
దీనిని మతం కోణంలో చూపి రె చ్చగొట్టాలని కుహానా లౌకిక వాదు లు చూస్తున్నారు. ఒవైసీ సహా కు హానా లౌకిక వాదులు ఎవరు అడ్డు కున్నా ఈ బిల్లు ఆగదు. దేశ శ్రేయ స్సు కోసం మోదీ ప్రభుత్వం మరి న్ని కఠిన నిర్ణయాలు తీసుకునేం దుకు సిద్ధంగా ఉంది.