KCR : బడేభాయ్, చోటేభాయ్ అలాయ్ బలాయ్
తెలంగా ణ లోక్సభ ఎన్నికల్లో బడేబాయ్ చోటే భాయ్ ఇద్దరూ కలిసి అలా య్, బలాయ్ అయ్యారని, పార్ల మెంట్ ఎన్నికలు పూర్తి కాగానే ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి, అదానీ కలిసి సింగరేణి సంస్థ ను ముంచుతారని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు హెచ్చరించా రు.
తెలంగాణలో వారిద్దరూ భారీ కుట్ర, కుతంత్రాలకు ఒడిగట్టారు
నన్ను ఎలాగైనా నిలువరించాలనే నా గొంతు నొక్కేందుకు నిషేధం విధించారు
హామీల అమలకు ఎగనామంతో ప్రజలకు నిలువునా మోసం
ఎన్నికల్లో గత్తరబిత్తర కాకుండా ఆలోచించి ఓటెయ్యాలి
గోదావరిఖని రోడ్ షోలో బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్
ప్రజా దీవెన, గోదావరిఖని: తెలంగా ణ లోక్సభ ఎన్నికల్లో(Lok sabha elections) బడేబాయ్ చోటే భాయ్ ఇద్దరూ కలిసి అలా య్, బలాయ్ అయ్యారని, పార్ల మెంట్ ఎన్నికలు పూర్తి కాగానే ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి, అదానీ కలిసి సింగరేణి సంస్థ ను ముంచుతారని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు హెచ్చరించా రు. ఎన్నికల కమిషన్ విధించిన 48 గంటల నిషేధం పూర్తవడంతో శుక్ర వారం రాత్రి కేసీఆర్ తన బస్సు యాత్రను పునః ప్రారంభించారు. పెద్దపల్లి పార్లమెంట్(Peddapalli parliament) నియోజకవర్గం లో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వ ర్ తరఫున ప్రచారం చేశారు. గోదావరిఖనిలో జరిగిన రోడ్ షోలో ప్రసంగించారు.
ఈ సందర్భంగా మాట్లాదుతూ తాను సీఎంగా ఉన్నప్పుడు ఆ దానిని తెలంగాణ లో అడుగు పెట్టనీయలే దని, కానీ రేవంత్ రెడ్డి దావోస్ కు వెళ్లి సంత కాలు పెట్టి మరీ ఆహ్వా నించారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నిక లు కాగానే సింగరేణిని ఊడగొడ తారని, ఈ ప్రాంత ప్రజలబతుకులు బొగ్గయ్యే పరిస్థితి ఉన్న దని హెచ్చ రించారు. సింగరేణికి పూర్వవైభవం తెచ్చాం నాడు మంచిగా ఉన్న సింగ రేణిని నిందా ముంచిందే కాంగ్రెస్ పార్టీ అని కేసీఆర్ దుయ్యబట్టారు. ‘సింగరేణి(Singareni) మన ఆస్తి ఆని, వంద శాతం మనకే ఉండేదని, కేంద్రం నుంచి తెచ్చిన అప్పులు చెల్లించ లేక 49% వాటాను కేంద్రానికి అప్ప గించింది దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు.బీఆర్ఎస్ పాయాంలో సింగరేణికి ఎన్నో లాభా లు, పునర్వైభవం తెచ్చామని వివ రించారు. నాడు హైటెక్, ఇంటెక్ పేరుపై ఉన్న కార్మిక సంస్థలు డిపెం డెంట్ ఉద్యోగాలను మునగ్గొట్టా యని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వాటిని పునరుద్ధరించి 19వేలకుపైగా యువతకు ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు.
ఆనాడు నష్టాల్లో ఉన్న సింగరేణిని లాభాల్లోకి తెచ్చామని వివరించారు. సింగరేణి ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనే పేరు మీద మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఆ మెడికల్ కాలేజీలో 5% సీట్లు కార్మికుల పిల్లలకే వచ్చేలా కృషి చేశామని చెప్పారు.పార్లమెంట్ ఎన్నికలు కావడమే ఆలస్యం మోదీ, రేవంత్ రెడ్డి కలిసి సింగరేణిని ఊదగొ డతరని కేసీఆర్ హెచ్చరించారు. తెలంగాణకు సింగరేణి కొంగుబం గారమని, ఒక ఉద్యోగ వనరు. దీనిని ఇంకా విస్తరించాలని, బయ్యా రం ఉక్కు గనులుగానీ, గోదావరి ఇసుక గనులుగానీ సింగరేణికే ఇవ్వాలని నేను ఆలోచించిన అని పేర్కొన్నారు.
అలాంటిది ఇప్పుడు అదానీ బొగ్గును తీసుకొనిరావడానికి సీఎం ప్రయత్నం చేస్తున్నాడని మండిప డ్డారు. కొప్పుల ఈశ్వర్ ఎంపీగా గెలిస్తే మొత్తం బీఆర్ఎస్(BRS) ఎంపీలు పార్లమెంట్ లో కొట్లాడి, పీక పట్టు కొని బిడ్డా మా సింగరేణిని ఎట్లా మూస్తవ్ అని కొట్లాడుతరని పేర్కొ న్నారు.నాడు ఉద్యమంలో ఒక దీపంతో మరో దీపం వెలిగించి నట్టు ఎప్పుడైతే తెలంగాణకు ప్రమాదం వస్తతో ఎప్పుడైతే తెలం గాణ ప్రమాదంలో పడుతుందో మనందరం ఏకం కావాలె, సరైన నిర్ణయాలు తీసుకోవాలె’ అని కోరారు. ఎవరైతే మన హక్కులు కాపాడుతారో, మన నదులను కాపాడుతారో, మన సింగరేణినిని కాపాడుతారో ఆలోచించాలని విజ్ఞప్తిచేశారు. అలా జరుగకపోతే పెద్ద ప్రమాదంలో పడతామని హెచ్చరించారు.
Modi and Revanth reddy collapsed singareni