Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bandi Sanjay: ఆరు గ్యారంటీల అమలు నిజమైతే నిరూపించండి

రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల అమలుపై చర్చ జరగకుండా ప్రజల దృష్టిని మళ్లిం చేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు ఇద్దరూ కలిసి డ్రామాలాడు తూ మీడియాలో బ్రేకింగుల కోసం యత్నిస్తున్నారని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు.

సమయం సందర్భం ఎక్కడో మీరే నిర్ణయించండి
నిరూపించకపోతే కాంగ్రెస్ అభ్యర్థు లంతా పోటీ నుండి తప్పుకోoడి
శ్రీరాముడంటే మీకందరికీ ఎందు కంత చీదరింపు
కాంగ్రెస్, బీఆర్ఎస్ ల పై ఎంపి బండి సంజయ్ ధ్వజం

ప్రజా దీవెన, కరీంనగర్: రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల(Six guarantees)అమలుపై చర్చ జరగకుండా ప్రజల దృష్టిని మళ్లిం చేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు ఇద్దరూ కలిసి డ్రామాలాడు తూ మీడియాలో బ్రేకింగుల కోసం యత్నిస్తున్నారని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్(MP Bandi Sanjay) మండిపడ్డారు.

వంద రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పా రని విమర్శించారు.గ్యారెంటీలు అమలు చేసినట్లు పచ్చి అబద్దాలా డుతున్నారని, హామీలను అమలు చేసినట్లు నిరూపిస్తే తాను ఎన్నికల్లో(elections)పోటీ నుండి తప్పుకుంటానని, అవ సరమైతే కాంగ్రెస్ తరపున ప్రచారం చేసేందుకు సిద్ధమని ప్రకటిస్తూ నిరూపించకపోతే కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్న 17 మంది అభ్యర్థు లు ఎన్నికల బరి నుండి తప్పు కునేందుకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు.

శనివారం కరీంనగర్ లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చే సిన మీడియా సమావేశంలో మా ట్లాడారు.ఆరు గ్యారెంటీలు ఇస్తా మని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలను అమలు చేసిన ట్లు నిరూపిస్తే పోటీ నుండి తప్పు కుంటానని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ సవాల్ చేశారు.

కల్యాణ లక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం ఇచ్చినట్లు, విద్యార్థినిలకు స్కూ టీలు అందించినట్లు, రైతు భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు రూ.15000 ఇచ్చినట్లు, ఇల్లు లేని వారికి స్థలం అందించడంతో పాటు నిర్మాణానికి ఐదు లక్షలు ఇచ్చిన ట్లు, ఆసరా పింఛన్లను రూ. 4 వేల కు పెంచినట్లు నిరూపిస్తే పోటీ నుండి తప్పుకుంటానన్నారు.

దమ్ముంటే ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, కాంగ్రెస్ నాయకులు తన సవాల్ ను స్వీకరించి అమర వీరుల స్తూపం వద్ద కానీ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద కానీ సమయం సందర్భం ఎక్కడో చేసి చెప్తే చర్చకు వస్తానన్నారు.దేశంలోని అన్ని మ తాలు, వర్గాలను సమానంగా చూ డాలన్నదే బీజేపీ(BJP) విధానమని, కానీ బీజేపీ ఏది మాట్లాడినా మతతత్వ మని ముద్రవేసే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇతర మతస్తుల ముందు హిందూ మతాన్ని హేళన చేసేలా మాట్లాడటం సిగ్గు చేటన్నారు.

ఓట్ల కోసం సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతి,(Hindu culture)సాంప్రదాయాలను కించ పరుస్తారా అసలు వీళ్లు హిందువు లేనా అని అనుమానం వస్తుంద న్నారు. మాట్లాడితే అయోధ్య అక్షింతలను కించపరుస్తున్నారని, అసలు రాముడంటే ఎందుకంత కసి, రాముల వారి అక్షింతలను, ప్రసాదాన్ని కూడా కించపరుస్తున్నా రన్నారు. ఒకాయన రేషన్ బియ్యం అంటారు.. నిన్న కేసీఆర్ అక్షింతలు పంచితే తీర్ధ ప్రసాదాలు పంచితే కడుపు నిండుతదా అని మాట్లా డటం సిగ్గుచేటన్నారు.

Prove implementation six guarantees true