Bandi sanjay kumar: రిజర్వేషన్లు రద్దు అంటే చీపుర్లతో ఊడ్చిపడేయండి
రిజర్వేషన్లు రద్దు అన్న వారిని చెప్పులు చీపురుల తో తరిమి తరిమి కొట్టాలని బిజెపి అభ్యర్థి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పిలుపునిచ్చారు.
లేదంటే రద్దన్న వారిని చెప్పులతో చాచికొట్టండి
ఆరు గ్యారెంటీ లపై ప్రజలను కాంగ్రెస్ మోసం
ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడే కెసీఆర్ బయటకొస్తాడు
హుజురాబాద్ రోడ్డు షో లో ఎంపి బండి సంజయ్
ప్రజా దీవెన, హుజురాబాద్: రిజర్వేషన్లు రద్దు అన్న వారిని చెప్పులు చీపురుల తో తరిమి తరిమి కొట్టాలని బిజెపి అభ్యర్థి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi sanjay kuamr) పిలుపునిచ్చారు. హుజురాబాద్ పట్టణంలోని బృందావన్ చౌరస్తాలో శుక్రవారం రాత్రి బండి సంజయ్ రోడ్ షో జరిగింది. ఈ రోడ్ షోకు మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, జిల్లా బిజెపి అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth reddy) ఇటీవల బిజెపి రిజర్వేషన్లు(reservation) రద్దు చేస్తోందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
భారతీయ జనతా మహిళా మోర్చా నిర్వహించిన మహిళా శక్తి సమ్మేళనంలో బిజెపి ఎంపి బండి సంజయ్(Bandi sanjay kuamr) పాల్గొనడం జరిగింది. మహిళల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(modi)చేసిన కృషి అనిర్వచనీయం. మహిళలను రాష్ట్రపతిగా, కీలక శాఖలకు మంత్రులను చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదని బండి తెలిపారు. మహిళలకు 33 శాతం రిజ్వేషన్లు అమలు చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్న మోదీ చొరవ వల్ల అతి త్వరలో మహిళల చేతికి అధికార పగ్గాలు రాబోతున్నాయని చెప్పారు. నారీ శక్తి పవర్ ఏంటో రాబోయే రోజుల్లో చూడటం తథ్యమని స్పష్టం చేశారు. బిఆర్ఎస్ పాలన అంటే గుర్తుకు వచ్చేది అత్యాచారాలు అరాచకాలు అవినీతి అని, కాంగ్రెస్ ది కూడా అదే పంథా అని, మహిళలకు అనేక హామీలు ఇచ్చి విస్మరించిందని, ఆ పార్టీకి ఓటేస్తే ఇక భస్మాసురా హస్తమే అని ధ్వజమెత్తారు.
reservation Cancelled says congress and BRS