Union Minister Bandi Sanjay : కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ప్రకటన, బిఆర్ఎస్ నేతలకు సి గ్గుంటే ఆ పార్టీ నుంచి బయటికి రావాలి
Union Minister Bandi Sanjay :ప్రజా దీవెన, కరీంనగర్: దేశంలోనే సంచలనం సృష్టించిన తెలంగాణ ఫోన్ టాపింగ్ కేసు రోజురోజుకు రా జకీయ పెనువివాదంగా మారుతోo ది. తాజాగా కేంద్ర హోంశాఖ సహా య మంత్రి బండి సంజయ్ సిట్ వి చారణకు హాజరైన తర్వాత చేసిన కామెంట్స్ పెను దుమారానికి దారి తీసింది. బండి సంజయ్ కామెంట్స్ పై స్పందించిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసర డం తో బండి సంజయ్ ప్రతి సవాల్ విసి రారు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగింద ని, ఈ విషయంలో తన కుటుంబం తో కలిసి తడి బట్టలతో గుడిలో ప్ర మాణం సిద్దమని చేసేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఓ విధంగా ఘాటుగా స్పం దించారు. మాజీ మంత్రి కేటీఆర్ ఏ గుడికి, ఎప్పుడు రమ్మంటడో చెబితే తాను భార్యా పిల్లలతో వస్తానని స వాలు విసిరారు. ‘ మా గుడులపై న మ్మకం లేకుంటే మీరు ఏదైనా మసీ దు, చర్చి పేరు చెప్పినా ఫరవా లేద ని, కేటీఆర్, కేసీఆర్ కుటుంబంతో రావాలన్నారు.
కేటీఆర్ నా ఫోన్ ట్యాప్ చేయించా డని తెలుసన్నారు. భార్యా భర్తల ఫోన్లు ట్యాప్ చేస్తవా అంటూ అగ్ర హోదగ్రుడు అయ్యాడు. తన ఫోన్ మాత్రమే కాదని సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ కూడ ట్యాపింగ్ జరిగిందని చె ప్పారు. బీఆర్ఎస్ మంత్రులు, లీడ ర్లు, ఎమ్మెల్యేలు, వ్యాపారస్తులు, సి నీ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయ్యా యని, బీఆర్ఎస్ నాయకులకు సి గ్గుంటే ఆ పార్టీ నుంచి బయటకొచ్చి బిజెపి పార్టీలో చేరాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ తో కేటీఆర్ వ్యాపారస్తు లను బ్లాక్ మెయిల్ చేసి భారీగా డ బ్బులు దండుకున్నారని ఆరోపించా రు. ఆ డబ్బులను కేసీఆర్ పశ్చిమ బెంగాల్ వెళ్లి మమతా బెనర్జీకి ఇ చ్చారని, కేసీఆర్ కు వేల కోట్ల రూ పాయల ఆస్తులు ఎక్కడివని ప్ర శ్నించారు.
మహారాష్ట్ర కు కూడా ఎన్నికల ఫం డింగ్ చేశారని ఆరోపించారు. ముం బై వెళ్లి డబ్బులు ఇచ్చి వచ్చారని అన్నారు. ఎస్ఐబీ మావోయిస్ట్ ల కోసం పనిచేయాలి కానీ, కానీ చి న్నపిల్లలు పాటలు పెట్టుకొని విన్న ట్టు పొద్దంతా మామాటలు వినుడే ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు పని అని అన్నారు. రాజకీయ నాయకు ల ఫోన్లు, వ్యాపారస్తుల ఫోన్లు, భా ర్యభర్తల ఫోన్లు, కుటుంబ సభ్యుల ఫోన్లు విన్నరన్నారు.మావోయిస్టు సింపతైజర్లు అంటూ కొందరు లీడర్ల ను కేంద్రానికి పంపి కేంద్రాన్ని తప్పు దోవ పట్టించారని బండి సంజయ్ అన్నారు.
ఒక వేళ కేంద్రం అనుమతి ఇవ్వ కుంటే మా వోయిస్టులను కట్టడి చే సేందుకు ప ర్మిషన్లు ఇవ్వట్లేదని కేం ద్రాన్ని బద్నాం చేయరా అని ప్రశ్నిం చారు. ఇదంతా రహస్యం కాబట్టేఈ నంబర్లను కేంద్రానికి క్రాస్ చెక్ చేసు కునే అవకాశం ఉండదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకంతో కేంద్రం అనుమతి ఇచ్చిందని తెలి పారు.