MLC Nominations: 19 మంది 21 సెట్ల నామినేషన్లు
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టబద్రుల శాసనమండలి ఉప ఎన్నిక(MLC nominations )నామినేషన్లలో భాగంగా 6 వ రోజైన బుధవారం 19 అభ్యర్థులు 21 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు.
ప్రజా దీవెన నల్గొండ: వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టబద్రుల శాసనమండలి ఉప ఎన్నిక(MLC nominations )నామినేషన్లలో భాగంగా 6 వ రోజైన బుధవారం 19 అభ్యర్థులు 21 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు.వరంగల్, ఖమ్మం,నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందనకు వీరు నామినేషన్ పత్రాలనుఅందించారు.బుధవారం నామినేషన్లు వేసిన వారిలో ధర్మసమాజ్ పార్టీ నుండి బరిగెల దుర్గాప్రసాద్ మహారాజ్ 1 సెట్ నామినేషన్, విద్యార్థుల రాజకీయ పార్టీ నుండి పాలకూరి అశోక్ కుమార్ 1 సెట్ నామినేషన్,
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్న 1 సెట్, గోండ్వానా దండకారణ్య పార్టీ నుండి సోడే వెంకటేశ్వర్లు 1 సెట్, బిఆర్ఎస్ పార్టీ నుండి ఏనుగుల రాకేష్ 1 సెట్, సోషల్ జస్టిస్ పార్టీ నుండి చెన్నా శ్రీకాంత్ 2 సెట్ల నామినేషన్లు, తెలంగాణ రిపబ్లికన్ పార్టీ నుండి గుండాల జ్యోతి 1 సెట్ నామినేషన్, బిజెపి నుండి కేదారి మేకల 1 సెట్ నామినేషన్లను దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోతుల ప్రార్థన 2సెట్లు, గంగిరెడ్డి కోటిరెడ్డి 1 సెట్, తేజావత్ వాసుదేవ 1 సెట్, భైరవభట్ల శ్రీనివాసరావు 1 సెట్, యాతకుల శేఖర్ 1 సెట్, దునుకుల వేలాద్రి 1 సెట్, గుగులోతు సంతోష్ 1 సెట్, రత్నం ప్రవీణ్ 1సెట్, జన్ను భరత్ 1 సేట్, గుగులోతు రాజు నాయక్ 1 సెట్, పట్టం మల్లికార్జున 1 సెట్ నామినేషన్లను(nominations ) దాఖలు చేశారు.
19 people 21 sets of nominations in mlc