భార్యను హతమార్చిన భర్త
ప్రజా దీవెన /ఖమ్మం: అనుమానం పెనభూతం అన్న పెద్దల మాటలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు (govt teache). అను మానం ఆరంభమై కుటుంబ కలహాలుగా మారి భార్యను హత మార్చే వరకు వెళ్ళిన సంఘటన ఆదివారం (Sunday) పొద్దుపోయాక ఖమ్మం (khammam) జరిగింది.
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామానికి చెందిన భూక్యా సీతారాములు ఇల్లెందు సమీపంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అతనికి రఘు నాథపాలెం గ్రామానికి చెందిన పార్వతి(43)తో 22 ఏళ్ల క్రితం వివాహం కాగా వీరు ఖమ్మంలో నివాసం ఉంటున్నారు. వివాహం(marraige)జరిగినప్పటి నుంచి వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి సీతారాములు పార్వతిని హత్యచేసి పరారయ్యాడు. ఆదివారం సాయంత్రంవారి ఇంటికి వచ్చిన పార్వతి సోదరుడు ఆమె విగత జీవిగా పడి ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.