Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mallu Bhatti Vikramarka: ఎన్నికల తరువాత బిఆర్ఎస్ అడ్రస్ గల్లంతు

ఎన్నిక‌ల త‌ర్వాత బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రం లో అడ్రస్ గల్లంతు కావడం ఖాయ మని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశా రు.

మీడియా సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

ప్రజా దీవెన, ఖమ్మం: ఎన్నిక‌ల(elections) త‌ర్వాత బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రం లో అడ్రస్ గల్లంతు కావడం ఖాయ మని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) స్పష్టం చేశా రు. ఇకపై కారు షెడ్డు నుంచి బయ టకు రానే రాదని చమత్కరించారు. ఖ‌మ్మం ఎంపిగా బిఆర్ఎస్(BRS) త‌రుపు న పోటీ చేస్తున్న నామా నాగేశ్వర రావు ఏ పార్టీ నుంచి మంత్రి అవుతారు అని ప్రశ్నించారు. తెలంగాణ‌లో ఒక్క సీట్ కూడా గెలవని బీఆర్ఎస్ నుంచి నామా ఎలా మంత్రి అవుతారని కెసిఆర్ ను నిల‌దీశారు.

ఖ‌మ్మంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్(Congress) గతంలో ఎలా సేవ చేసింది భవిష్యత్ లో కూడా అలా సేవ చేస్తామన్నారు భ‌ట్టి, రూ. 1400 కోట్ల తో పూర్తి కావల్సిన ప్రాజెక్టు లను వేల కోట్లు వెచ్చించి ఒక్క చుక్క నీరు రాకుండా చేసిన చరిత్ర కేసీఆర్ ది అన్నారు. తాము మాత్రం కృష్ణా జలాలతో పాటు గోదావరి జలాలు కూడా అంది స్తామన్నారు.ధనిక రాష్ట్రంను మీ చేతిలో పెడితే ఒక్క నెల కూడా మొదటి నెల జీతం ఇవ్వలేని ప్రభు త్వం మీద‌ని కేసీఆర్(KCR) చేసిన విమ‌ ర్శ‌లు స్పందిస్తూ, తాము అధికారం లోకి వచ్చిన దగ్గర నుంచి అందరికీ జీతాలు ఇస్తున్నామన్నారు. కాకి అరిచినట్లు గా రైతు బందు ఇవ్వ లేదు అని అంటున్నారని తెలి పారు. సోయి వుండి మాట్లా డుతున్నారా అని ప్రశ్నించారు.

ఇప్ప‌టికే 65 లక్షల మందికి రైతు బందు వేశామ‌ని, మిగిలిన వారికి వేస్తున్నామన్నారు. అబద్దాల పునాదుల మీద బ్రతికిన బీఆర్ఎస్(BRS) అధికార పార్టీ మీద బురద చల్లడం కేసీఆర్ లక్ష్యం అన్నారు. బాష మార్చుకో కేసీఆర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గులేకుండా మాజీ ముఖ్యమంత్రి హోదా లో ఏమిటా మాటలు అన్నారు. దద్దమ్మలు, సన్నాసులు అంటే చూస్తూ ఊరుకోమన్నారు. కెసిఆర్ చేసిన దోపిడీ సొమ్ము తోటే తాము గ్యారెంటీ పథకాలు అమలు చేస్తామన్నారు. కోడ్ పూర్తి కాగానే ఇందిరమ్మ ఇళ్ల కు శంఖుస్థాపనలు చేస్తామన్నారు.

BRS address after election is Gallanthu