–కేటీఆర్, హరీశ్ లకు కాంగ్రెస్ పై బురదజల్లే ఒకేపని
— ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
Chief Minister Mallu Bhatti Vikramarka : ప్రజా దీవెన, ఖమ్మం: రాష్ట్రంలో ప దేండ్ల పాటు అధికారంలో ఉన్న బీ ఆర్ఎస్ చేసిన తప్పుల వల్లే నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని డిప్యూటీ సీఎం భ ట్టి విక్రమార్క ఆరోపించారు. దాన్ని తమ ప్రభుత్వం ప్రస్తుతం సరిదిద్దు తుంటే మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు లకు బురదజల్లే పని చేస్తున్నారని విమర్శించారు.ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయం నుం చి సాగర్ ఆయకట్టుకు మంత్రి పొం గులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి నీటి ని విడుదల చేశారు. ఈ సంద ర్భంగా మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే కరెంట్, వ్య వసాయం, బహుళార్థ సాధక ప్రా జెక్టులు అన్నారు. ధనిక రాష్ట్రంగా 2014లో టీఆర్ఎస్ కు ప్రభుత్వా న్ని అప్పజెబితే ప్రజలకు అన్యా యం చేసిందన్నారు. గోదావరి, కృ ష్ణా బేసిన్లలో రాష్ట్రానికి అన్యాయం జరిగేలా ఆ పార్టీ వ్యవహరించిం ద న్నారు. సాగర్ లెఫ్ట్ కెనాల్లో శ్రీశైలం పైన రోజుకు 11 టీఎంసీలు డ్రా చే సుకునేలా ఏపీ ప్రభుత్వం లిఫ్ట్లు క డుతుంటే అడ్డుకోలేదన్నారు. జూ రాల, నెట్టెంపాడు, కొడంగల్ లిఫ్టుల ద్వారా ఎక్కువ నీటిని ఉపయోగిం చుకునేలా తమ ప్రభుత్వం పని చే స్తుందని చెప్పారు.
వచ్చే నాలుగు రోజులో నీరు విడుదల… గతేడాది భారీగా వర దల కారణంగా కొట్టుకుపోయిన మె యిన్ కెనాల్, డిస్ట్రిబ్యూటరీలను పూర్తి స్థాయిలో పునరుద్దరించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తె లిపారు. ప్రస్తుతం 400 క్యూసెక్కు ల నీటిని విడుదల చేశామని, నా లుగు రోజుల్లో పూర్తి స్థాయిలో రిలీ జ్ చేస్తామని చెప్పారు. కృష్ణా బేసిన్ కు ఈ ఏడాది 15 రోజుల ముందే వ రద నీరు వచ్చిందన్నారు.