TSRTC Bus: మహిళలతో మమేకమైన డిప్యూటీ సీఎం
కరెంటు మం చిగా వస్తుందా, ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఎలా ఉంది, ఎన్నిసార్లు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయా ణం చేశారoటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మహిళా ప్రయాణికులతో ముచ్చట పెట్టారు.
ఆర్టీసీ బస్సులో ఆరు హామీలపై మహిళ ప్రయాణికులతో భట్టి విక్ర మార్క ముచ్చట్లు
కరెంటు మంచిగా వస్తుందా, ఆర్టీ సీలో ఉచిత ప్రయాణం ఎలా ఉంది
మహిళా సంఘాలతో బస్సులు కొనుగోలు చేయించబోతున్నాము
రాష్ట్రంలో 92 శాతం ఉన్న బలహీ నవర్గాలు ఆర్థికాభివృద్ధి సాధించడ మే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
మహిళల ఉచిత ప్రయాణం బి ఆర్ఎస్ నాయకులకు ఇష్టం లేన ట్టుంది
ఆరు గ్యారంటీల్లో ఐదు అమలు చేశాం,బీ ఆర్ఎస్ నేతలు కళ్ళు లేని కబోదుల్లా మాట్లాడుతున్నారు
మా ప్రభుత్వంలో ఉద్యోగులకు ప్రతినెల మొదటి తేదీనే జీతాలిస్తు న్నాం
ప్రజా దీవెన, ఖమ్మం: కరెంటు మం చిగా వస్తుందా, ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఎలా ఉంది, ఎన్నిసార్లు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయా ణం చేశారoటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు(Deputy CM Bhatti Vikramarka) మహిళా ప్రయాణికులతో(Passenger) ముచ్చట పెట్టారు. బుధవారం సాయంత్రం ఖమ్మం పాత బస్టాండ్ నుంచి బోనకల్లు మండలం జగన్నాధపురం వరకు సామాన్యుడిలా ప్రయాణం చేస్తూ స్థానికులను పలు అంశాలపై ఆరా తీశారు. సామాన్యుడిలా టికెట్ కొనుక్కొని పల్లె వెలుగు బస్సులో డిప్యూటీ సీఎం ప్రయాణించడం అందరినీ దృష్టిని ఆకర్షించింది.
నాగులవంచ గ్రామానికి చెందిన జానమ్మ, అనంతమ్మలతో డిప్యూటీ సీఎం ముచ్చటించారు. డిప్యూటీ సీఎం ప్రశ్నలకు వారు ఇరువురు స్పందిస్తూ ‘బడి, గుడి,, పేరంటాల కు ఉచితంగా బస్సులో వెళ్లడం మూలంగా డబ్బులు మిగులుతు న్నాయి, ఆర్థికంగా కొంత వెసులుబా టు కలుగుతోంది’ అని వారు సంతో షంగా సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో ఉచితంగా ప్రయాణం చేసే మహిళలకు జారీ చేస్తున్న జీరో టికె ట్ల విధానం గురించి కండక్టర్(Conductor sailaja) శైల జను డిప్యూటీ సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద ర్భంగా స్థానికంగా మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పలు అంశాలు వెల్లడించారు.
ఫ్రీ బస్సు లు వాడుకుంటున్న మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు ఆని భట్టి విక్రమార్క తెలిపారు. మహిళ లకు రాష్ట్రంలో ఉచిత ప్రయాణం అమలు చేయడం వల్ల ఆర్టీసీ బలో పేతం అవుతున్నది, కొత్తగా 300 పైగా బస్సులు కొనుగోలు చేశారు. అంతేకాకుండా ఆర్టీసీ విస్తరణకు దోహదపడుతున్నది భట్టి విక్రమా ర్క అన్నారు. సీతారామ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంతో ప్రయా ణికుల సంఖ్య బస్సుల్లో పెరిగినం దున కొత్త బస్సులు కావలసిన అవసరం ఏర్పడుతున్నది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka mallu)వివరించారు. స్వయం సహాయక సంఘాల మహి ళా సభ్యులకు రుణాలు ఇప్పించి వారితో బస్సులు కొనుగోలు చేయిం చి వాటిని ఆర్టీసీలో పెట్టాలన్న ఆలో చన చేస్తున్నామని తెలిపారు.
మ హిళలను ఆర్థికంగా అభివృద్ధి చే యడమే మా ప్రభుత్వ లక్ష్యం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో 92 శాతం ఉన్న బలహీన వర్గాలు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా మా ప్రభుత్వ పనితీరు ఉంటుంద న్నారు. ఈ సందర్భంగా ఖమ్మం పాత బస్టాండ్ లో పాతర్లపాడు గ్రామానికి వెళ్లే బస్సును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించా రు.ఎన్నికల్లో ఇచ్చిన 6 హామీల మేరకు అధికారంలోకి వచ్చి అసెం బ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన గంట లోపే ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణా న్ని మహిళలకు ప్రారంభించాము అన్నారు . ప్రతినెల రూ.300 కోట్ల కు పైగా మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్న డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీకి చెల్లించడం వల్ల ఆ సంస్థ బలోపేతం అవుతున్నది అన్నారు. కొత్త బస్సుల కొనుగోలు ఆర్టీసీ విస్తరణకు ఉచిత బస్సు పథకం ఎంతగానో దోహదప డుతు న్నది గత ప్రభుత్వంలో ఆర్టీసీ ఉంటుందా,మూసివేస్తారా, అమ్మి వేస్తారా, ప్రతినెల జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండేది కాదు. ఆర్టీసీ అమ్మేస్తారన్న వార్తలు కూడా వచ్చాయి అలాంటి దుస్థితిలో ఉన్న ఆర్టీసీని ఉచిత ఆర్టీసీ(Free RTC scheme) పథకం ద్వా రా ఇందిరమ్మ రాజ్యం ప్రజా ప్రభు త్వంలో ఆర్థికంగా బలోపేతం చేశా ము అని తెలిపారు.
ఆర్టీసీ ఉన్న అప్పులపై వడ్డీ రేట్లు తగ్గించడానికి ఆలోచన చేస్తున్నాము బీఆర్ఎస్ నాయకులకు మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయ డం ఇష్టం లేనట్టుగా ఉంది అందుకే ఉచిత ఆర్టీసీ బస్సు పథకం నడవ దంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శలు చేశారు. ఈ రూట్లల్లో బస్సుల అవసరం ఉన్నాయా కూ డా సర్వే చేయిస్తున్నాము. గత పాలకులు ఏడు లక్షల కోట్ల పైగా అప్పులు చేసి రాష్ట్ర ప్రజలపై భారం మోపారు ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ సంపద సృష్టించి ఆ సంపదను ప్రజలకు పంచడానికి మా ప్రభుత్వం అడు గులు వేస్తున్నది అని తెలిపారు.
గత ప్రభుత్వం ఉద్యోగులకు ప్రతి నెల 15 తర్వాతనే వేతనాలు ఇచ్చేది మేము అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఉద్యోగులకు ఒక టో తారీఖున వేతనాలు ఇస్తున్నా ము. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీలో ఐదు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేస్తున్న వాటి ద్వారా కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారు, ఇది బిఆర్ఎస్(BRS Leaders) నాయకుల కంటికి కనబడటం లేనట్టుంది కళ్ళు లేని కబోదులుగా మాట్లాడటం విడ్డూ రంగా ఉన్నది అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైరా శాసనస భ్యులు రామదాసు నాయక్, జిల్లా కలెక్టర్ గౌతమ్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ వెంకన్న తదితరులు పాల్గొ న్నారు.
Deputy CM Bhatti Vikramarka meets women in TSRTC Bus