KCR Road show:మీరన్నట్లు ఆర్ఆర్ ట్యాక్స్ నిజమైతే ఈడీ, బోడీలను దించండి
తెలంగాణ ప్రాంతంలోని గోదవరి నదీజలాలను తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కుట్రలు చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపిం చారు.
కేంద్ర స్వతంత్ర సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు
గోదావరి నీటిని కర్ణాటక, తమిళ నాడుకు తరలింఫుకు మోదీ కుట్ర
అడ్డగోలు హామీలతో ఓట్లు కొల్ల గొట్టి అధికారంలోకి కాంగ్రెస్
ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో వాలాల బతుకులు ఆగం చేశారు
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటేస్తే గోదాట్లో వేసినట్లే
కొత్తగూడెం లో రోడ్ షో, కార్నర్ మీటింగ్ లలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్
ప్రజా దీవెన, కొత్తగూడెం: తెలంగాణ(Telangana) ప్రాంతంలోని గోదవరి నదీజలాలను తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కుట్రలు చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) ఆరోపిం చారు. ఎన్నికల ప్రచారంలో భాగం గా తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ ను వసూలు చేస్తున్నారంటూ మోదీ అన్నారని, అదే నిజమైతే ఈడీ, బోడీ లను అధికారులతో సీఎం రేవంత్ రెడ్డిపై దర్యాప్తుకు దించా లని డిమాండ్ చేశారు.
మంగళవా రం రాత్రి కొత్తగూడెంలో నిర్వహిం చిన రోడ్ షో,(Road show) కార్నర్ మీటింగ్ లో కేసీఆర్ ప్రసంగించారు. ఆ రూపం లో చేయగానే కాదు విచారణ జరిపిస్తారా లేదా అని ప్రశ్నించారు. దేశంలో గత పదేళ్లుగా మోదీ దు ర్మార్గమైన పాలన కొనసాగించారని ఆరోపించారు. స్వతంత్రంగా వ్యవ హరించే వ్యవస్థలన్నింటినీ కేంద్ర సర్కారు తన అధీనంలోకి తెచ్చు కొని ఇష్టా రీతిగా వ్యవహరిస్తోందని మండి పడ్డారు.
రాష్ట్రంలో ప్రజలకు కాంగ్రె స్ పార్టీ అడ్డగోలు హామీలతో అర చేతిలో వైకుంఠం చూపి, ఓట్లు కొల్లగొట్టి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీల కథ ముగిసిపోయిందని, లోక్సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు ఓట్లు వేస్తే గోదావరిలో వేసినట్లేనని చెప్పా రు. ఎన్నికల్లో అటు కేంద్రంలో ఉన్న బడాభాన్ని, రాష్ట్రంలో ఉన్న చోటా భాయ్ ని ఓడించాలని పిలు పుని చ్చారు.
పాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలో జిల్లాలను తాము పెంచా మని అయితే ఆ పెంచిన జిల్లాలను తీసేయాలని కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఆలో చిస్తోందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా రేవంత్ ప్రభుత్వం నెరవేర్చలేదని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రైతుబంధు వచ్చిందా? కల్యాణ లక్ష్మి వచ్చిందా? తులం బంగారం అన్నారు.. ఇచ్చారా? మహిళలకు రూ.2,500 వస్తున్నాయా? రూ.2లక్షల రుణం మాఫీ చేశారా?.. అని ప్రజలను ప్రశ్నించారు.
రాష్ట్రంలో సాగు కోసం 24 గంటల విద్యుత్తు ఇవ్వడం లేదని, తమ హయాంలో రెప్పపాటు కూడా కరెంట్ పోలేదని పేర్కొన్నారు. రైతుల పొలాలు ఎండిపోతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. స్కాలర్షిప్లు, ఫీజు రీయంబర్స్మెంట్ రావడం లేదని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు (Free bus)సౌకర్యం ఏర్పాటుచేసి, ఆటోవాలాల బతుకులను ఛిద్రం చేశారని, వారు ఆత్మహత్య చేసుకునే స్థాయికి పరిస్థితిని తీసుకొచ్చారని విమర్శించారు.
సింగరేణి బొగ్గుబావులను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం కుట్ర పన్నిందని, దీన్ని తాము వ్యతిరేకించి పోరాటం జరపడం ద్వారా సింగరేణి సంస్థను కాపాడామని చెప్పారు. అన్ని రకాలుగా సింగరేణి కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేశామని పేర్కొన్నారు. స్థానిక రైతాంగం కోసం సీతారామప్రాజెక్టును అద్భుతంగా నిర్మించామని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను గెలిపిస్తే వ్యవ సాయ పంపుసెట్లకు మీటర్లు పెడతారని హెచ్చరించారు. కాగా యాత్ర సందర్భంగా కొత్తగూడెంలో కేసీఆర్ బస్సు పై నుంచి కిందపడబోయారు. గుర్తించిన సిబ్బంది కేసీఆర్ను పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది.
కార్నర్ మీటింగ్ అనంతరం కొత్తగూడెంలోని ఇల్లెందు అతిథి గృహంలో రాత్రి బసచేశారు. బుదవారం ఉదయం కొత్తగూడెం(Kothagudem)నుంచి కేసీఆర్ మహబూబాబాద్ నియోజకవర్గానికి వెళ్లనున్నారు.కాగా సోమవారం రాత్రి ఖమ్మంలో బస చేసిన కేసీఆర్, సీపీఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు ఇంటికి వెళ్లారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను కేసీఆర్ పరామర్శించారు.
KCR Kothagudem road show