Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bhatti Vikramarka: పుండాకోరు పునాదుల‌పై బిఆర్ఎస్

దేశంలో ఎక్కడా లేని పుండాకోరు ముచ్చట్ల పునాదులపై బిఆర్ఎస్ పార్టీ కొన సాగుతుందని రాష్ట్ర ఉపముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క ధ్వజ మెత్తారు.

ఆ పార్టీ అధినేత కేసిఆర్ వన్నీ పచ్చి అబద్ధాలు
ప్ర‌జ‌లు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కేసీఆర్ ను బండ‌కేసి కొట్టినా బుద్ధిరాలేదు
ఏ యూనివ‌ర్శిటీలోనూ విద్యుత్, తాగునీరు కొరత స‌మ‌స్య‌ల్లేవు
కూసుమంచి ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్రమార్క

ప్రజా దీవెన, కూసుమంచి: దేశంలో ఎక్కడా లేని పుండాకోరు ముచ్చట్ల పునాదులపై బిఆర్ఎస్ పార్టీ కొన సాగుతుందని రాష్ట్ర ఉపముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ధ్వజ మెత్తారు. ఆ పార్టీ అధినేత కెసిఆర్ చెప్పేవన్నీ పచ్చి అబద్దాలని దు య్యబట్టారు. తెలంగాణ ప్ర‌జ‌లు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కేసీఆర్(KCR) ను బండ‌కేసి కొట్టినా కూడా బుద్దిరా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశా రు.పాలేరు నియోజకవర్గం కూసు మంచి కార్నర్ మీటింగ్ లో భట్టి మాట్లాడారు.

కేసీఆర్ చెప్పే అబ ద్దాలు ప్రజలు సైతం అసహ్యించు కునే స్థాయికి చేరుకున్నాయని వ్యాఖ్యానించారు.అబద్దాల పునా దులపై బతుకుతున్న బీఆర్ ఎస్(BRS) నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్(Congress) అధికారంలోకి వస్తే హామీలు అమ లు చేయలేరని అబద్దాలు మాట్లా డుతున్నారని, తాము అధికారం లోకి వచ్చిన వెంటనే ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీని రూ.10 లక్షలకు పెంచడం చేశామన్నారు.

మార్చి ఒకటో తేదీనుంచి 200 యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్ వినియోగించే పేద కుటుంబాలకు జీరో కరెంట్ బిల్లు ఇవ్వడం జరిగిందన్నారు. నిరుపేద, అర్హత కలిగిన అబ్దిదారులకు రూ.500కే గ్యాస్ ఇస్తున్నామన్నా రు. అంతేకాక ప్రతి నియోజకవర్గం లో నిరుపేదల కోసం 3,500 రెండు గదుల ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తు న్నామ‌ని వారికి తప్పకుండా అంది స్తామన్నారు.

పాలేరు నియోజకవ ర్గంలో పేదలు, దళిత, గిరిజనులు అధికంగా ఉంటార‌ని, త‌మ‌కు అధి కంగా ఇండ్లు మంజూరు చేయాలని కోరార‌న్నారు. తప్పకుండా అధికం గానే ఇండ్లను మంజూరు చేస్తామ న్నారు.కేసీఆర్ తన‌ పదేళ్లలో ఏనా డైనా పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారాన్ని అందించారా అని ప్రశ్నించారు. జరిగిన నష్టంకు సంబంధించిన లెక్కలను కూడా తెప్పించుకున్నామ‌ని, తప్పకుండా పరిహారాన్ని అందిస్తామ‌ని అంటూ బడ్జెట్ లో కూడా కేటాయింపులు చేశామన్నారు.

పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశామ‌ని, కేలండర్ ప్రకారం నోటిఫికేషన్లు(Notification) ఇచ్చి ఉద్యోగాలను భర్తీ చేస్తామ న్నారు. రాష్ట్రంలోని వర్సిటీల్లో విద్యుత్, తాగునీరు పుష్కలంగా అందుబాటులో ఉంద‌ని, విద్యా ర్థులంతా అక్కడే ఉండి కాంపి టేటివ్ పరీక్షలకు ప్రిపేర్ కావచ్చ న్నారు. విద్యుత్ కోతలపై పదేళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి అన్నీ అబద్దాలు మాట్లాడు తున్నారని, పవర్ కట్ అంటూ జగ దీశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఇండ్ల లో కూర్చుని తప్పుడు ట్వీట్లు చేశారని మండిపడ్డారు.

కాగా అబద్దాలతో కట్టు కథలతో ఈ దేశాన్ని పాలి స్తున్న నరేంద్ర మోడీ, బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దేశ సంపదను, వనరులను ప్రజలకు చెందకుండా తన సన్నిహితులపై క్రోని కేపిటలిస్టులకు ప్ర‌ధాని కట్టబెడుతున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు భ‌ట్టి దేశ సంపదను ప్రధాని మోదీ,(Modi) రాష్ట్ర సందను కేసీఆ ర్ ఈ పదేళ్లలో దోచేశారంటూ ఆరో పించారు. మరోసారి బీజేపీతో బీఆ ర్ఎస్ చేతులు కలిపి సంపదను దో పిడీ చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.

ఒక వైపు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కే బీజేపీ-మోదీ ఒకవైపు, ప్రజా స్వా మ్యాన్ని కాపాడేందుకు, దేశ సం దను ప్రజలకు పంచాలనే రాహుల్ గాంధీ(Rahul Gandhi) మరోవైపు ఈ సార్వత్రిక ఎన్ని కల్లో ప్రజలకు దగ్గరకు వచ్చా రన్నా రు. మనమంతా రాహు ల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయిం చిన ఖమ్మం అభ్యర్తి రామసహాయం రఘురామిరెడ్డికి ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

KCR speech lies on his rule