Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Ponguleti : మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్య, ఒక్కక్షణం కూడా ఏ జర్నలిస్ట్ ను మరువను

Minister Ponguleti : ప్రజా దీవెన, వైరా: జీవితంలో ఏ ఒక్క క్షణం కూడా ఏ ఒక్క జర్నలి స్టును మర్చిపోను, విస్మరించను. ఇందిరమ్మ ప్రభుత్వ ఏర్పాటులో జర్నలిస్టుల పాత్ర కూడా కీలకమని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. గత 18నెలలుగా ప్ర జాపాలన సజావుగా సాగడంలో వా రి సహకరం ఉందని, వారి న్యాయ పరమైన కోరికలు తీర్చడానికి ఇంది రమ్మ ప్రభుత్వం ఎప్పుడూ ముందే ఉంటుందని తెలిపారు. ఖమ్మం జిల్లా వైరాలోని శబరి గార్డెన్స్లో గురువారం జరిగిన టీయూడ బ్ల్యూజే (ఐజేయూ) 4వ జిల్లా మ హాసభకు ముఖ్యఅతిథిగా హాజర య్యారు.

ఈ సందర్భంగా సభను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే రంగ రంగ వైభ వంగా వైరా పట్టణంలో ఏర్పాటు చేసుకున్న ఐజేయూ మహా సభకు నేను రావడం ఆనందంగా ఉంద న్నారు. పదేండ్ల పాటు అధికారం లో ఉన్న ఆనాటి ప్రభుత్వంలో నే నూ కొంతకాలం ఉన్నప్పటికీ మీకో సం ఏమి చేయలేని నిస్సహాయక స్థి తిలో కొనసాగానని ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, అక్ర మాలను, నిజాన్ని వెలికితీయడం లో మీరు పడ్డ బాధలు నాకు తెలు సన్నారు.

ఈ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తం గా అనేకమంది ఇబ్బందులు పడ్డ జర్నలిస్టులు ఉన్నారని, మీరు కోరు కున్న మూడు కోరికల్లో ఒకటి ఇండ్ల స్థలాల కేటాయింపు సుప్రీంకోర్టు ప రిధిలో ఉందని, ఎలా చేస్తే జర్నలి స్టులకు మేలు చేకూరుతుందో న్యా య నిపుణుల సలహా తీసుకుంటు న్నాం. నూతన అక్రిడేషన్ జారీ విధి విధానాలపై సోమ లేదా మంగళవా రాల్లో చర్చించి ఎలా చేస్తే బాగుం టుందో ఓ నిర్ణయం తీసుకుందామ న్నారు. దీనిపై ఓ స్పష్టత వస్తే హెల్త్ కార్డులు ఇవ్వడమనేది పెద్ద ఇబ్బం ది కాదని, ఇందిరమ్మ ప్రభుత్వం వ చ్చేదాంట్లో జర్నలిస్టులు కూడా ప్ర ధాన పాత్ర పోషించారని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో నేను కానీ, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కానీ మీ న్యా యమైన కోరికలను నెరవేర్చే దాం ట్లో పాజిటివ్ దృక్పథంతో ముందుం టామని మరోమారు స్పష్టంగా చెప్ప దల్చుకున్నానన్నారు.

ఏదైనా ఓ నిర్ణయం తీసుకుంటే అది కాంప్లికేటెడ్ కావొద్దని, ఏ ఒక్కరూ కూడా వేలెత్తి చూపొద్దని ఉద్దేశ్యం తో మీడియా మిత్రుల కోరికల అమ లుకు కాస్తా జాప్యం జరుగుతుంద ని, ఆచరణ సాధ్యం కానీ హామీలు ఈ ప్రభుత్వం ఇవ్వదని పేర్కొన్నా రు.