Ponguleti vs Bhatti: ఖమ్మం గడ్డలో పొలిటికల్ బిగ్ ఫైట్
ఖమ్మం గడ్డలోనూ కాంగ్రెస్‌లో ఎంపీ టికెట్ కోసం బిగ్ ఫైట్ నడుస్తోంది. అభ్యర్థిపై హై కమాండ్ ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతోంది.
నామినేషన్ గడువు దగ్గరకు వస్తోంది
ఎంపీ అభ్యర్థిని ప్రకటించని కాంగ్రెస్
కార్యకర్తలు, నాయకుల్లో ఉత్కంఠ చర్చ
ప్రజాదీవెన, ఖమ్మం: ఖమ్మం గడ్డలోనూ కాంగ్రెస్‌లో ఎంపీ టికెట్ కోసం బిగ్ ఫైట్ నడుస్తోంది. అభ్యర్థిపై హై కమాండ్ ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతోంది. పొంగులేటి ప్రసాద్‌రెడ్డి,(Ponguleti Prasad Reddy)మండవ మధ్యే ప్రధానంగా పోటీ ఉందని తెలుస్తోంది. ఇక టికెట్ రేసులో ఉన్న భట్టి నందిని పోటీలో లేనట్లేనని తెలుస్తోంది. సోదరుడు ప్రసాద్‌రెడ్డికి టికెట్ కోసం మంత్రి పొంగులేటి తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
ఇదే సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి మండవ పేరు కూడా తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే మండవ వెంకటేశ్వరరావు నాన్ లోకల్ అని రేణుకవర్గం అంటోంది. లోకల్ కమ్మ సామాజికవర్గం నాయకుడికే టికెట్ ఇవ్వాలని రేణుక డిమాండ్ చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
కరీంనగర్ కాంగ్రెస్(Congress) అభ్యర్థిని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. నామినేషన్ గడువు దగ్గర పడుతుండటంతో అభ్యర్థి విషయంలో క్లారిటీ లేదు. దాంతో కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్‌రావు భారీ ర్యాలీతో వెళ్లి ఇవాళ నామినేషన్(Nomination) వేసేందుకు రెడీ అయ్యారు. గత కొద్దిరోజులుగా కరీంనగర్ ఎంపీ అభ్యర్థి ప్రకటనలో జరుగుతున్న జాప్యంతో పార్టీ కేడర్‌లో టెన్షన్ పెరిగిపోతోంది. అనధికారికంగా ఆయనే అభ్యర్థిఅంటూ వెలిచాల రాజేందర్ రావు సన్నిహితులు చెబుతున్నారు.
రాజేందర్‌రావు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించలేదని, ఎవరికి టికెటిచ్చినా కలిసికట్టుగా పనిచేయాలని చెబుతున్నారు. దీంతో క్యాడర్ అభ్యర్థి విషయంలో అయోమయానికి గురవుతోంది. ఓపక్క ప్రధాన ప్రతిపక్షాలు రెండూ కరీంనగర్‌లో(Karimnagar) ప్రచార స్పీడ్ పెంచాయి. బీజేపీ, బీఆర్‌ఎస్ ప్రచార రథాలు సందడిగా తిరుగుతున్నాయి. కానీ కాంగ్రెస్ ప్రచారంలో ఎలాంటి హడావిడి కనబడకపోవడంతో అధికారంలో ఉండికూడా ఈ పరిస్థితి పార్టీ క్యాడర్‌కి మింగుడుపడటం లేదు.
హైదరాబాద్ పాతబస్తీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు? ఇది కాంగ్రెస్ కేడర్‌లో వినిపిస్తున్న ప్రశ్న. అధికారంలో ఉండి కూడా ఇప్పటివరకూ హైదరాబాద్ క్యాండెట్‌ను అనౌన్స్ చేయకపోవడంపై పార్టీలోని కొందరు సీనియర్లు కూడా అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. అయితే ఇక్కడ మొదట మస్కతి పేరు వినిపించినా.. ఆ తర్వాత సమీరుల్లా పేరు తెరపైకి వచ్చింది. మరోవైపు కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ కూడా హైదరాబాద్ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. టోటల్‌గా కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాలకు కాంగ్రెస్ అధిష్ఠానం ఇవాళ రాత్రి వరకూ అభ్యర్థులను ప్రకటించవచ్చని కాంగ్రెస్ వర్గాల సమాచారం.
Political Big Fight in Khammam Gadda