Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Election Code expired: ఎన్నికల కోడ్ ముగిసిoది

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెను వెంటనే ఆరుగారంటీల అమలుపై దృష్టి పెట్టింది. ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని పది లక్షల రూపాయలకు పెంచుతూ అక్కడి కక్కడే నిర్ణయం తీసుకున్నారు.

పరుగులు తీయనున్న పాలన
పాతుకుపోయిన అధికారుల బదిలీలు
సంక్షేమం -అభివృద్ధి జోడెడ్లుగా సాగాలని సర్కారు నిర్ణయం
అధికారుల పనితీరుపై ప్రతి నెలా నివేదికలు, సమీక్షలు

ప్రజా దీవెన, ఖమ్మం: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం(Congress People’s Government)ఏర్పడిన వెను వెంటనే ఆరుగారంటీల(Six guarantees)అమలుపై దృష్టి పెట్టింది. ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ(Rajeev Arogyashri)పరిమితిని పది లక్షల రూపాయలకు పెంచుతూ అక్కడి కక్కడే నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు విద్యుత్తు వినియోగించుకునే వారికి జీరో బిల్లు మంజూరును అమల్లోకి తెచ్చారు. హామీ ఇవ్వక పోయినప్పటికీ డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాల బకాయిలను మంజూరు చేశారు. 30 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు అందజేశారు.

ఈ క్రమంలోనే లోక్ సభ ఎన్నికల కోడ్(Lok Sabha Election Code)అమల్లోకి రావడంతో ఒకసారి గా పాలనకు బ్రేక్ పడింది. పాలనలో కొంత స్తబ్దత ఏర్పడింది. కోడ్ ముగిసిన వెంటనే ఈ నెల 9 నుంచి పాలనను పరుగు లు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క మల్లు(Deputy CM Bhatti Vikra Marka Mallu) ప్రణాళికలు రూపొం దించారు. వరుస సమీక్షలు, క్షేత్ర స్థాయి పర్యటనలకు రంగం సిద్ధం చేశారు. ఈ నెలాఖరులోగా రాష్ట్రం లో పాతుకుపోయిన అధికారులు, ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని నిర్ణయించారు. మూడేళ్లకు పైగా ఒకే చోట పాతుకుపోయిన అధికా రులందరినీ కదిలించాలని నిర్ణ యించినట్లు సమాచారం.

ఈనెల 9న ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీలకు కార్యాచరణ ప్రారంభ మైంది, ఈనెల చివరకు ఈ ప్రక్రియ ముగియనుంది. సంక్షేమం- అభివృ ద్ధి జోడేడ్ల తరహాలో రాష్ట్రంలో పాలన ముందుకు సాగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క మల్లు నిర్ణయించినట్లు తెలిసింది. ప్రజా పాలన అందించడం లో అధికారుల భాధ్యత తీవ్రంగా ఉంటుంది. అధి కారుల పనితీరుపై ప్రతి నెలా నివే దికలు తెప్పించుకొని సమీక్షలు నిర్వహించాలని, అశ్రద్ద వహించే అధికారులను పక్కకు పెట్టాలని ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.

మధిరలో ప్రారంభమైన డిప్యూ టీ సీఎం వరుస సమీక్షలు..

గత ప్రభుత్వాల మాదిరిగా మాటలకే పరిమితం కాకుండా హామీ ఇచ్చిన అన్ని అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆదివారం మధిరలో మున్సిపల్, విద్యుత్తు, నీటిపారుదల శాఖల అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ నెల 12 ,13న ఖమ్మంలో డి ప్యూటీ సీఎం అధ్యక్షతన మం త్రుల సమీ క్షలు, క్షేత్ర పర్యటనలు

నీళ్లు, నియామకాల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన గత పాలకులు ఖమ్మం జిల్లాలో ఇందిరా, రాజు సాగర్ ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యం చేశారు. సాగునీటి ప్రాజె క్టుల విషయంలో ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఈ నేప థ్యంలో ఈనెల 12న సీతారామ సాగునీటి ప్రాజెక్టు(Sitarama Irrigation Project), వైరా రిజర్వా యర్ కు సాగర్ కాల్వ అను సంధానం, నాగార్జునసాగర్ ప్రాజెక్టు సాగునీటి సరఫరా అంశా లను సమీక్షించనున్నారు. నాగార్జు నసాగర్ ఎడమ కాలువ ద్వారా వైరా రిజర్వాయర్ కు సాగు నీటిని మళ్లించేందుకు డిప్యూ టీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్ర మార్కమల్లు ఎన్నికల కోడ్ కు ముం దే రూ. 75 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పనుల పైన సమీక్ష నిర్వహించ నున్నారు.

ఖమ్మంలో సమీక్ష చేపట్టిన మరుసటిరోజే ఈనెల 13న సాగునీటి ప్రాజెక్టుల పనులు, వాటి ప్రగతిని తెలుసు కునేందుకు డిప్యూటీ సీఎం ఆధ్వ ర్యంలో మం త్రులు తుమ్మల నాగేశ్వ రరావు(Tummala Nageshwar Rao), పొంగులేటి శ్రీనివాసరెడ్డి లు సంయు క్తంగా క్షేత్ర పర్యటన చేపట్ట నున్నట్టు తెలిసింది. సీతారామ ప్రాజెక్టు పరిధిలో దుమ్ము గూడెం నుంచి జూలూ రుపాడు వరకు జరుగు తున్న పనులు, ఏనుకూరు నుంచి వైరా రిజర్వాయర్ కు నాగార్జు నసా గర్ ఎడమ కాలువను లింక్ చేయ డం వంటి పనులను క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులతో సమీక్షిం చనున్నట్లు తెలిసింది. ఇదే సంద ర్భంలో విద్యాశాఖ పరిధిలోని మన ఊరు- మనబడి, సంక్షేమ శాఖలోని వివిధ పథకాల అమలు తీరును సైతం పరిశీలించనున్నట్టు సమా చారం.

The Election Code has expired