— రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
Minister Ponguleti Srinivasa Reddy : ప్రజా దీవెన, ఖమ్మం: తిరుమలా యపాలెం మండల చరిత్రలో కేవ లం ఏడాదిన్నరలోనే సుమారు రూ. 77 కోట్ల 50 లక్షలతో కనీవినీఎరుగ ని అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పధకాలను అమలు చేసు కున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి
పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.
మంగళవారం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో రూ.2 కోట్ల 20 లక్షలతో తిరుమలాయపాలెం నుం డి పిండిప్రోలు వరకు, రూ. 1కోటి 10 లక్షలతో తిరుమలాయపాలెం మామిళ్ళ కుంట నుండి ఈదుల చె ర్వు వరకు పీఆర్ రోడ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనం తరం రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసి న కార్యక్రమంలో నూతన రేషన్ కా ర్డులు, కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడు తూ రాష్ట్రంలో 15 ఐటీఐ కాలేజీలు మంజూరైతే అందులో ఒకటి తిరు మలాయపాలెంకు కేటాయించామ న్నారు. రూ. 26 కోట్లతో 30 పడక ల ఆసుపత్రిని 50 పడకల ఆసుప త్రిగా అప్ గ్రేడ్ చేయబోతున్నామని తెలిపారు. తిరుమలాయపాలెం ములకలపల్లి బ్రిడ్జి నిర్మాణం కోసం రూ. 1 కోటి 50 లక్షలు, రూ.50 లక్ష లతో సిసి రోడ్లు, రూ. 92 లక్షలతో అంతర్గత సిమెంట్ రోడ్లుతో పాటు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసు కు న్నామని మంత్రి చెప్పారు.
ప్రజలకు మాయమాటలు చెప్పి రెం డు పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి, పేద ప్రజల అ భివృద్ధిని, సంక్షేమాన్ని పూర్తిగా వి స్మరించిందని విమర్శించారు. అం దుకే మూడోసారి అధికారంలోకి రా కుండా ప్రజలు చెంప చెల్లుమనిపిం చారని పేర్కొన్నారు. కేసీఆర్ కాళే శ్వరం పేరుతో తెలంగాణ సొమ్ము ను దోచుకున్నారని ఎన్నికల ముం దు చెప్పాం అది ఇప్పుడు నిజమని తేలిపోయిందన్నారు. సుమారు 16 నెలలు విచారణ తర్వాత పీసీ ఘో ష్ కమిషన్ 665 పేజీల నివేదికలో కెసిఆర్ దోపిడీ వివరాలు స్పష్టంగా తెలియజేసిందన్నారు.
పేదవారి నుంచి దోచుకున్న డబ్బు లు ఖర్చు పెట్టడానికి మళ్లీ వస్తార ని, ఆ డబ్బు తీసుకుని ప్రజలు ఇం కోసారి బీఆర్ఎస్ రెండు చెంపలు చెళ్లు మనిపించాలని ప్రజలను కో రారు. అతి తక్కువ కాలంలోనే మ న ప్రజాప్రభుత్వం అనేక సంక్షేమ ప ధకాలను పేదలకు అందిస్తూ, రాష్ట్ర ప్రగతి కోసం ఎంతో కృషి చేస్తుంద న్నారు. 200 యూనిట్ల ఉచిత వి ద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సు లో ఉచిత ప్రయాణం, సన్నబియ్యం తో పాటు 5లక్షల నూతన రేషన్ కా ర్డులు ఇవ్వడంతో పాటు 18ల క్షల మంది కొత్త పేర్లు చేర్చామన్నా రు.
ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇం దిరమ్మ ఇళ్లు కేటాయించామని, అ ర్హులైన పేదలందరికీ ఇంకా మూడు విడతల్లో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామ ని మంత్రి తెలిపారు. ధరణి పేదవా రికి శాపంగా మారితే దాన్ని బంగా ళాఖాతంలో వేసి భూబారతి తీసు కొచ్చామన్నారు. రాబోయే ఎన్నిక ల్లో ప్రజల దీవెనలు ఇందిరమ్మ ప్ర భుత్వంపై ఉండాలని మంత్రి కోరా రు.