Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Wine shop closed: మదనపడుతున్న మద్యం ప్రియులు

మందుబాబులకు చేదు వార్త చెప్పింది ఎన్నికల సంఘం. ఇటీవలే లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరిగిన నేపథ్యం లో తెలంగాణలో రెండు రోజుల పాటు వైన్ షాపులు, బార్లు మూత పడిన సంగతి తెలిసింది.

ముచ్చటగా మూడు రోజులు పాటు మద్యం షాపులు మూత
ఈ నెల 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల నేపధ్యంలో ఆంక్షలు
ఖమ్మం, వరంగల్, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో మాత్రమే బంద్

ప్రజాదీవెన, నల్లగొండ బ్యూరో: మందుబాబులకు చేదు వార్త చెప్పింది ఎన్నికల సంఘం. ఇటీవలే లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరిగిన నేపథ్యం లో తెలంగాణలో రెండు రోజుల పాటు వైన్ షాపులు, బార్లు మూత పడిన సంగతి తెలిసింది. ఇప్పుడు మరోసారి లిక్కర్ షాపులు క్లోజ్ అవ్వనున్నాయి. జూన్ 4తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేప థ్యంలో ఆ రోజు కూడా వైన్ షాపులు మూసేయనున్నారు. అయితే.. ఈ గ్యాప్ కూడా మరో సారి కూడా లిక్కర్ షాపులకు తాళా లు పడనున్నాయి.

మే 27వ తేదీ, సోమవారం ఉమ్మడి వరంగల్- నల్గొండ- ఖమ్మం జిల్లాల పట్టభ ద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఆ రోజున కూడా వైన్ షాపులతో పాటు బార్లు బంద్ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. నల్గొండ- ఖమ్మం- వరంగల్ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

ఈనెల 27న వరంగల్‌, నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్లు ఎమ్మెల్సీ ఉపఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించుకోను న్నారు. ఈ క్రమంలోనే ఎలాంటి అవాంఛ నీయ సంఘటనలు జరగకుండా.. 27వ తేదీన వైన్ షాపులు మూసేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది.
అయితే మే 27న ఎన్నికల పోలింగ్ జరిగే మూడు జిల్లాల్లో మాత్రమే వైన్స్ షాపులు, బార్లను 48 గంటల పాటు బంద్ చేయనున్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో మే 25 సాయంత్రం 4 గంటల నుంచి 27న సాయంత్రం 4 గంటల వరకు లిక్కర్ షాపులు క్లోజ్ అవ్వనున్నాయి.

Wine shop closed in MLC Elections