Praja Deveena
Newspaper Banner
Date of Publish : 09 July 2026, 4:43 am Posted by : praja deveena

ACB surprise Trap Bribery Case : బిగ్ బ్రేకింగ్, ఏసీబీ వలలో పెద్ద చే ప,మ్యాప్ మార్చడానికి మనీ అడి గిన సూపరింటెండెంట్ ఖేల్ ఖతం

ACB surprise Trap Bribery Case : ప్రజా దీ వెన, మహ బూబ్‌నగర్ : ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి తిమింగ లా ల వేటను ఏసీబీ (AC B) అధికారులు మరింత వేగవం తం చేశారు. తాజాగా మహబూబ్‌ నగర్ జిల్లా సర్వే మరియు భూ రికార్డుల కార్యాలయంలో ఓ పెద్దచేప ఏసీబీ అధి కా రు ల వలలో చిక్కింది. గ్రామ పటంలో చిన్న సవరణ కోసం ఏ కంగా రూ. 15,000 లం చం డిమాండ్ చేసిన సూప రింటెం డెంట్, బుధవారం (08.07.2026) నాడు రెడ్-హ్యాండెడ్‌గా దొరికిపోయారు.

భూత్‌పూర్ మండలం, కర్వేన గ్రా మానికి చెందిన ఓ బాధి తుడు తన భూమికి సంబంధించి న గ్రామ పటంలో (Vill age Map) సవరణలు చేయించుకోవ డానికి కార్యాలయం చుట్టూ తిరిగాడు. ఫైలును సహాయ సంచాలకుల ముం దుకు పంపాలంటే సదరు కార్యాలయ సూపరింటెండెంట్ బొమ్మిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి పచ్చజెండా ఊ పాల్సి ఉంది .అ యితే, తన అధి కా రిక పనిని చేయడా నికి సదరు అధి కారి రూ. 15,000 లంచం ఇస్తేనే ఫైలు కదు లుతుందని ఖరా ఖండిగా చెప్పారు. లంచం ఇవ్వడం ఇ ష్టం లేని బాధితుడు వెంటనే మహబూబ్‌నగర్ రేంజ్ ఏసీబీ అధి కారులను ఆశ్ర యించారు.

స్కెచ్ రివర్స్.. రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్

ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగారు. బాధి తుడి నుండి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్ రెడ్డి రూ. 15,00 0 లంచం సొమ్ము ను స్వీకరిస్తుండగా, మాటు వేసిన ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి అతడిని రెడ్-హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

      లంచం సొమ్ము రికవరీ

నిందితుడి వద్ద నుండి లంచం రూ పంలో తీసుకున్న రూ. 15,000/- నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తన విధిని అక్రమం గా, అవినీతితో నిర్వహించినందు కు గా నూ సదరు నిందిత అధికారి ని (AO) అధికారులు అరెస్ట్ చే శారు. జ్యుడీషియల్ రిమాండ్ నిమి త్తం హైదరాబాద్ నాం పల్లిలోని SP E & ACB కేసుల ఒకటవ అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై మరింత లోతుగా దర్యాప్తు జరుగుతోంది. భద్రతా కా రణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను అధికారులు అత్యంత గోప్యంగా ఉంచారు.

ఇదిలా ఉండగా ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగు లు లం చం డిమాండ్ చేస్తే వెనకడుగు వేయకండి. అవినీతి పై పోరాడటానికి తెలంగాణ ఏసీబీ మీకు ఎల్లప్పుడూ అండ గా ఉంటుందని ఏసీబీ అధికారులు అప్పీల్ చేస్తున్నారు. ఫి ర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నం బర్ 1064 (ఉచితం), వా ట్సాప్ (WhatsApp)9440446106,ఫేస్‌బుక్ Telangana ACB,X (ట్విట్టర్) @TelanganaACB అకౌంట్ లలో చేయ వచ్చని,లంచం అడిగేవారి వివరాలను ఏసీబీకి సులువుగా చేరవేయడానికి అన్ని ప్ర భుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలలోACB QR కోడ్స్ అందు బాటులో ఉంచబడ్డాయి. ఫిర్యాదు దారుల పేర్లు, వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచ బడతాయని వెల్లడించారు.