Civils 2023: సివిల్స్ లో ఆల్ఇండియా 3వ ర్యాంకు సాధించిన అనన్యరెడ్డి
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్స్ 2023 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో మొత్తం 1,016 మందిని యూపీఎస్సీ సెలక్ట్ చేసింది.
ప్రజా దీవెన, న్యూఢిల్లీ,: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్స్ 2023 (Civils 2023) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో మొత్తం 1,016 మందిని యూపీఎస్సీ సెలక్ట్ చేసింది. వీరిలో ఆదిత్య శ్రీవాత్సవకు ఫస్ట్ ర్యాంక్ రాగా, అనిమేష్ ప్రదాన్ రెండో ర్యాంకు, దోనూరి అనన్య రెడ్డి మూడో ర్యాంకు, పీకే సిద్ధార్థ్ రామ్ కుమార్ నాలుగో ర్యాంకు, రుహనీ ఐదో ర్యాంకు సాధించారు.జనరల్ కేటగిరిలో 347, ఈడబ్ల్యూఎస్ 115, ఓబీసీ 303, ఎస్సీ కేటగిరి కింద 165, ఎస్టీ కేటగిరి కింద 86 మందిని ఎంపిక చేశారు. యూ పి ఎస్ సి ప్రిలిమ్స్, మెయిన్స్ లో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి ఫలితాలు విడుదల చేశారు.
ర్యాంకర్స్ కు సీఎం రేవంత్ అభినందనలు.. (Civils 2023)సివిల్స్ -2023 ఫలితాల్లో మెరిసిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ముఖ్యమం త్రి ఏ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఈసారి దాదాపు 50 మందికి పైగా సివిల్ సర్వీసెస్ కు ఎంపికవటం పట్ల ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధిం చిన పాలమూరుకు చెందిన దోనూరి అనన్య రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
Ananya reddy third rank in Civils 2023