Mahbub Nagar local body MLC by-election: మహబూబ్‌నగర్ మండలి ఎన్నికల్లో ఎగిరిన గులాబి జెండా
వరుస ఎన్నికల్లో ఓటమితో రోజు రోజుకు నిరసించిపోతున్న బిఆర్ ఎస్ పార్టీకి ఊరట లభించినట్ల యిoది.మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్ని కల్లో బిఆర్ఎస్ విజయం
కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి పై 111 ఓట్ల తేడాతో బిఆర్ఎస్ అభ్యర్థి ఎం.నవీన్ రెడ్డి విజయం
ప్రజా దీవెన, మహబూబ్ నగర్: వరుస ఎన్నికల్లో ఓటమితో రోజు రోజుకు నిరసించిపోతున్న బిఆర్ ఎస్ పార్టీకి ఊరట లభించినట్ల యిoది.మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో(Mahbub Nagar local body MLC by-election) బీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి ఎం.నవీన్ రెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై(Congress candidate Manne Jeevan Reddy) 111 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఎన్ నవీన్ రెడ్డికి763 ఓట్లు, మన్నే జీవన్ రెడ్డి కి 652 ఓట్లు పడ్డాయి. దీంతో ఈ సీటును బీఆర్ఎస్ గెలుపొందింది.
కాగా మహబూ బ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి(Kasireddy Narayana Reddy) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి కాంగ్రెస్ ఎమ్మె ల్యేగా గెలుపొందారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనా మా చేయడంతో అక్కడ ఉప ఎన్ని క అనివార్యమైన విషయం తెలిసిం దే. కాగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకు న్న విషయం తెలిసిందే.కాంగ్రెస్ తరపున మన్నె జీవన్‌రెడ్డి, బీఆర్ ఎస్ తరపున నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్‌గౌడ్ ప్రధాన అభ్యర్థులుగా పోటీ పడ్డారు. ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో మొ త్తం 1,439 మంది ఓటర్లు ఉండగా 1,437 మంది ఓటు హక్కును విని యోగించుకున్నారు. మార్చి 28న ఈ ఉప ఎన్నిక జరగగా ఏప్రిల్ 2న ఫలితం వెలువడాల్సి ఉంది. అయి తే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేయడంతో నేడు కౌంటింగ్‌ను నిర్వహించారు.
BRS win in Mahabubnagar council elections