Praja Deveena
Newspaper Banner
Date of Publish : 28 April 2026, 8:23 am Posted by : praja deveena

mahabubabad family Tragedy : బిగ్ బ్రేకింగ్, మూగబోయిన చి రు నవ్వులు, తొర్రూరులో విషాదకర ఘటన

mahabubabad family Tragedy : ప్రజా దీవెన, మహ బూబాబాద్: అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు,కళ్ల ముందే ఎగిరిగంతేసే చిన్నారులు రేపటి భవిష్యత్తుపై ఎన్నో ఆశలుకానీ, ఆ తండ్రి మనసులో రేగిన ఆవేదన, గూడుక ట్టుకున్న కుటుంబ కలహాలు మూడు ప్రాణాలను బలితీసు కున్నాయి. తొర్రూరు మండల కేంద్రంలోని వ్యవసాయ మా ర్కెట్ కమిటీ సమీపం లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థాని కంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

ఈ హృదయ విదారక సంఘటనకు సంబంధించిన పూర్వా పరాలు ఇలా ఉన్నాయి. అమ్మపురం గ్రామానికి చెందిన కి న్నెర గుమ్ షావలి (35) తన ఇద్దరు చిన్నారులు విలష్ (5), వికేష్ (3)లతో కలిసి నివ సిస్తున్నారు. అనుకోని పరిస్థితు ల్లో కుటుంబ కలహాలు తలెత్తడంతో తీవ్ర మనస్తాపానికి గు రైన షావలి, ఈదారుణ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది.

ఆగిపోయిన ఊపిరిలు పచ్చని సంసారంలో తలెత్తిన చిచ్చు, కన్నతం డ్రిని కఠినాత్ముడిగా మార్చింది. తన కళ్లముందే ఎది గే చిన్నారులను, వారి భవిష్యత్తును పట్టించుకోకుండా, ఇద్ద రు పిల్లలకు ఉరివేసి, ఆ తర్వాత తండ్రి కూడా ఉరి వేసుకొ ని ఆత్మహత్యకు పాల్పడటం అందరినీ కలచివే స్తోంది. స్థా నికులు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరు కున్న పోలీసులు కే సు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సమాజానికి హెచ్చరిక ఈ ఘటన పట్ల స్థానికులు తీవ్ర ది గ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి మన స్పర్థలు, కు టుంబ సమస్యలు ఇ లాంటి తీవ్ర నిర్ణయాలకు దారితీయ డం అత్యంత దురదృష్టకరం. మానసిక ఒత్తిడి లేదా సమ స్యలు ఉన్నప్పుడు ఆత్మహత్య పరిష్కారం కాదని, కౌన్సె లింగ్ లేదా ఆప్తుల సహాయం తీసుకోవడం ద్వారా ఇటువం టి విషాదాలను అరికట్టవచ్చని సామాజిక వేత్తలు సూచి స్తు న్నారు.