Mahbubnagar Road Accident : ప్రజా దీవెన, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలు గురు మృతిచెందగా మరో ఐదుగు రు గాయాల పాలయ్యారు. హైదరా బాద్ నుంచి ప్రొద్దుటూరుకు ప్రయా ణికులతో వెళ్తున్న ట్రావెల్ బస్సు రా త్రి 2గంటల సమయంలో అడ్డాకుల వద్ద ముందు వెళుతున్న లారీని వేగంగా ఢీకొట్టిగా ఈ దుర్ఘటన చో టుచేసుకుంది. ఈ ప్రమాదంలో బ స్సు క్లీనర్ హసన్ (35),అస్రాఫ్ ఉ న్నిసా (70), ఎల్లమ్మ (40), మరో మహిళ అక్కడికక్కడే చనిపోయా రు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడం తో ఘటనా సంఘటన స్థలానికి చే రుకున్న పోలీసులు మృతదేహాల ను బయటకు తీసి పోస్ట్మార్టం ని మిత్తం హాస్పిటల్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేయడం ద్వారా దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సోమ వారం ఉదయం జాతీయ రహదారి 44పై ఈ ప్రమాదం సంభవించింది.
హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరు వెళ్తున్న బీసీవిఆర్ ట్రావెల్స్ బస్సు మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం కాటవరం స్టేజ్ వద్ద అ దుపుతప్పి ముందువెళ్తున్న కంటై నర్ లారీని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణి స్తు న్న నలుగురు ప్రయాణికులు అక్క డికక్కడే మృతి చెందగా మరో ము గ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయ పడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానిక వాహనదారులు వెంటనే పో లీసులకు సమాచారం ఇచ్చారు.
స్థానికుల సమాచారంతో హుటా హుటీన ఘటనా స్థలానికి చేరుకు న్న పోలీసులు ప్రమాద స్థితిని పరిశీ లించిన మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన వారితో పాటు, మృతదేహాలను కూడా హా స్పిటల్కు తరలించారు. పోస్ట్మా ర్టం తర్వాత మృతదేహాలను బాధి తకుటుంబాలకు పోలీసులు అంద జేయనున్నారు. ఇక ప్రమాదం కార ణంగా రోడ్డుకు అడ్డంగా పడిపోయి న వాహనాలను క్రేయిన్ సహాయం తో తొలగించిన పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తు న్నట్టు తెలిపారు.