Seeds: క్యూలో చెప్పులు పునరావృతం
వర్షా కాలం సాగుకు అవసరమైన జీలుగ విత్త నాల కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో ఆగ్రోస్ కేంద్రా నికి మంగళవారం రాత్రి 560 బస్తా ల సబ్సిడీ జీలుగ విత్తనాలు సరఫ రా చేశారు.
తూప్రాన్ రైతులకు తప్పని తిప్పలు
సరిపడా విత్తనాలు లేవంటూ రైతుల రాస్తారోకో
ప్రజా దీవెన,తూప్రాన్: వర్షా కాలం సాగుకు అవసరమైన జీలుగ విత్త నాల(Jeeluga Vittanala)కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో ఆగ్రోస్ కేంద్రా నికి మంగళవారం రాత్రి 560 బస్తా ల సబ్సిడీ జీలుగ విత్తనాలు సరఫ రా చేశారు. విషయం తెలియగానే రైతులు(Farmers) బుధవారం ఉదయం అక్క డికి చేరుకున్నారు. రైతులు ఆగ్రోస్ కేంద్రం తెరిచే వరకు అక్కడ నిలబ డలేక చెప్పులను క్యూలో పెట్టారు. వ్యవసాయ అధికారి గంగుమల్లు, ఏఈవోలు(AEO) సంతోష్‌కుమార్, సింధు రైతులకు విత్తనాలను పంపిణీ చేశా రు.
ఓ వైపు పంపిణీ జరుగుతుండ గానే జీలుగ విత్తనాలు సరిపడా లేవంటూ కొందరు రైతులు తూప్రాన్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేప ట్టారు. తమకు జీలుగ విత్తనాలు అందించడంలేదంటూ వారు ఆరో పించారు. అయితే మధ్యాహ్నం వరకు పంపిణీ చేయగా 170 బస్తాల జీలుగ విత్తనాలు ఇంకా మిగిలినట్లు ఏవో గంగుమల్లు (AO Gangumallu)తెలిపారు. రైతుల ఆందోళనతో మరో వెయ్యి బస్తాల జీలుగ విత్త నాలను ఆర్డర్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
farmers trouble for seeds