Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nominations : ఆరవ రోజు…. 28 సెట్ల నామినేషన్లు

నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఆరవ రోజైన బుధవారం 13- నల్గొండ పార్లమెంట్ స్థానానికి మొత్తం 22 మంది అభ్యర్థులు 28 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.

ప్రజా దీవెన నల్లగొండ: నామినేషన్ల(Nominations) ప్రక్రియలో భాగంగా ఆరవ రోజైన బుధవారం 13- నల్గొండ పార్లమెంట్ స్థానానికి మొత్తం 22 మంది అభ్యర్థులు (Candidates) 28 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.

బి ఆర్ ఎస్(BRS) పార్టీ తరఫున కంచర్ల కృష్ణారెడ్డి 2 సెట్లు.బిజెపి(BJP) తరఫున నూకల నరసింహారెడ్డి 2 సెట్లు.
బిజెపి అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తరఫున 1 సెట్. కాంగ్రెస్ (Congress)పార్టీ తరపున రఘువీర్ కుందూరు3 సెట్లు.

కాంగ్రెస్ పార్టీ తరపున కుందూరు జానారెడ్డి 2 సెట్లు. డీఎస్పీ (ధర్మసమాజ్ పార్టీ) తరపున తలారి రాంబాబు 1 సెట్ బిఎస్పి (బహుజన్ సమాజ్ పార్టీ) తరపున విరిగినేని అంజయ్య 1 సెట్.
తెలంగాణ సకల జనుల పార్టీ తరపున నందిపాటి జానయ్య 2 సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు.నేషనల్ పీపుల్స్ పార్టీ తరఫున చిలుక రామ్ బాబు1 సెట్ దాఖలు చేశారు.

స్వతంత్ర అభ్యర్థులు…

శిరసాల శ్రీనయ్య 1 సెట్. అఖిల్ సంపంగి 1సెట్, పాలకూరి రమాదేవి 1 సెట్, పాలకూరి రవి 1 సెట్, గోలి సైదులు1 సెట్, పోతుల యాదగిరి 1 సెట్, పోతుల ప్రార్ధన 1 సెట్, కుందారపు శ్రీకాంత్ 1 సెట్లు, గంగిరెడ్డి కోటిరెడ్డి 1 సెట్, నూనె సురేష్ 1 సెట్, షేక్ ఉస్మాన్ బాబా 1 సెట్, ధరావత్ మోతిలాల్ 1 సెట్, అంజన పల్లి రవి 1 సెట్ నామినేషన్లు దాఖలు చేశారు.నల్గొండ (Nalgonda)పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందనకు వీరు నామినేషన్ పత్రాలను అందజేశారు.

22 Members nomination in Nalgonda