Parliament constituency: నల్లగొండ లోకసభ బరిలో 22 మంది అభ్యర్థులు
నల్లగొండ లోకసభ స్థానానికి 22 మంది అభ్య ర్థులు పోటీలో ఉన్నట్లు నల్లగొండ పార్లమెంటు నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన తెలిపారు.
నామినేషన్లను ఉపసంహరించు కున్న 9 మంది అభ్యర్థులు
నల్లగొండ పార్లమెంటు నియో జకవర్గం రిటర్నింగ్ అధికారి, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన వెల్లడి
ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ లోకసభ స్థానానికి(Lok sabha elections) 22 మంది అభ్య ర్థులు పోటీలో ఉన్నట్లు నల్లగొండ పార్లమెంటు నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి చాంబర్లో జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు మాణిక్ రావు సూర్యవంశీ తో కలిసి ఏర్పాటుచేసిన మీడియా ప్రతిని ధులతో ఆమె మాట్లాడుతూ నల్లగొండ లోక సభ స్థానానికి మొత్తం 31 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు కాగా, ఉపసంహరణ గడువైన సోమవారం 9 మంది అభ్యర్థులు వారి నామినేషన్లను(Nominations withdraw) ఉపసంహరించుకున్నారని, దీంతో 22 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు.
పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ ఎన్నికల నిబంధనల ప్రకారం గుర్తులు సైతం కేటాయించినట్లు తెలిపారు.నల్గొండ లోకసభ నియోజకవర్గం పరిధిలో మొత్తం 17 లక్షల 25,465 మంది ఓటర్లు ఉండగా, అందులో ఎనిమిది లక్షల 80,453 మంది మహిళా ఓటర్లు ,ఎనిమిది లక్షల44,843 మంది పురుష ఓటర్లు ఉన్నారని ,7739 మంది సర్వీస్ ఓటర్లు, 18 నుండి 19 సంవత్సరాల మధ్య వయసు ఉన్న, మొదటిసారి ఓటు హక్కు వచ్చినవారు 61143 మంది, 85 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్ ఓటర్లు 9592 మంది, దివ్యంగ ఓటర్లు 33,890 మంది నమోదయ్యారని ఆమె వెల్లడించారు.
ఓటర్లలో ప్రత్యేకించి నూతనంగా ఓటు హక్కు నమోదు చేసుకున్న వారిని చేతన్యం చేసేందుకుగాను జిల్లా వ్యాప్తంగా 5 కే రన్లు, 2 కే రన్లతో పాటు, ఈవీఎం ల పై ఓటరు అవగాహన కై కటౌట్లు ,హోర్డింగ్ లు ఏర్పాటు చేయడం జరిగిందని, మొదటిసారి ఓటు హక్కు పొందిన వారందరూ స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి వారి ఓటును సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 85 సంవత్సరాలు పైబడిన వారికి, అలాగే దివ్యంగ ఓటర్లకు మే 3 వ తేదీ నుండి హోమ్ వోటింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామని, ఇందుకుగాను ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు, ఒక్కో బృందానికి సూక్ష్మ పరిశీలకులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగులందరికీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తున్నామని, వీరందరూ నల్గొండ లోకసభ పరిధిలో ఏర్పాటు చేసే 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని కోరారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలన్ని సంబంధిత అసెంబ్లీ నియోజక వర్గాలకు పంపించడం జరిగిందని, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో రాండమైజేషన్ తర్వాత పోలింగ్ కేంద్రాలకు పంపించ నున్నట్లు తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్థులందరూ కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల ప్రవర్తన నియమాలని తప్పకుండా పాటించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి సక్రమ అమలుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 5 కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఎలక్ట్రానిక్ మీడియా(Electronic media), సోషల్ మీడియాలో(Social Media) ప్రచారం కోసం అభ్యర్థులు ఎం సి ఎం సి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, ఎవరైనా అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించినట్లయితే ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కింద చర్య తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
అదే విధంగా ఎలాంటి అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలాలు ఆస్తులపై ప్రచారం నిర్వహించ కూడదని, ప్రైవేటు వ్యక్తుల ఇండ్లపై ప్రచారం చేసినప్పటికీ సంబంధిత యజమా ని అనుమతి తీసుకో వాలని తెలియజేశారు. వాహనా లు, ఇతర అనుమతులకు కలెక్టర్ కార్యాలయంలో సువిధ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, 24 గంటలు పనిచేసే విధంగా ఇక్కడ అనుమతులు ఇవ్వడం జరుగుతుందని, ఆన్లైన్ లొనే కాకుండా ఆఫ్ లైన్ ద్వారా సైతం అనుమతులు తీసుకోవ చ్చని, పార్లమెంటు నియోజకవర్గం మొత్తానికి రిటర్నింగ్ అధికారి ద్వారా సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గం వరకైతే ఆయా ఏఆర్ఓ ల ద్వారా అనుమతులు తీసుకోవాలని చెప్పారు. ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులకై సమాచారానికై జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని 1950 హెల్ప్ లైన్ సైతం ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాలో స్వేచ్ఛగా శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని,ఈ నెల 25 వ తేదీ నుండి ఓటర్ చీటీలను సైతం పంపిణీ చేయడం మొదలుపెట్టామని, వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని పోలింగ్ కేంద్రాలలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని ,ప్రత్యేకించి ఒక మెడికల్ కిట్టును ఏర్పాటు చేసి అందులో ప్రత్యేకంగా ఓ ఆర్ఎస్ పాకెట్లు, మందులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు .
అన్ని పోలింగ్(Polling) కేంద్రాలలో తాగునీరు, లైట్లు, ఫ్యాన్ వంటివి ఏర్పాటు చేశామని అందువల్ల జిల్లాలోని ఓటర్లందరూ పెద్ద ఎత్తున మే 13 వ తేదీ నిర్వహించే లోకసభ ఎన్నికల పోలింగ్ లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. నల్లగొండ పార్ల మెంటుకు నిర్వహించే ఎన్నికలను పరిశీలించేందుకుగాను కేంద్ర ఎన్నికల సంఘం జిల్లాకు సీనియర్ ఐఏఎస్ అధికారి మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశి ని సాధారణ పరిశీలకులుగా నియమించిందని, అన్ని పార్టీల అభ్యర్థులు అలాగే జిల్లా ప్రజలు ఎన్నికలకు సంబంధించి ఏవైనా ప్రత్యేకించి ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు సంబంధించి వీరి అధికారిక ఫోన్ నెంబర్ 7337046757 కు ఫోన్ చేసి తెలియజేయవచ్చని తెలిపారు.
జిల్లా ఎస్పీ చందన దీప్తి(Chandana deepthi) మాట్లాడు తూ లోక సభ ఎన్నికల(Lok sabha elections) ప్రవర్తనా నియమాలు అమలలో భాగంగా ఇదివరకే నగదు, మద్యం ,ఇతర విలువైన ఆభరణాలు సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికలకు కేవలం రెండు వారాలు మాత్రమే మిగిలి ఉన్నందున మరింత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. 50 వేలకు మించి నగదు వెల్లెవారు సరైన విధంగా ఆధారాలతో సహా వెళ్లినట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడం జరుగుతుందని, అక్రమంగా తీసుకువెళ్లే నగదు బంగారు మద్యం తదితర వాటిని విడుదల చేసే విషయంలో తక్షణమే స్పందిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ మీడియా ప్రతినిధుల సమావే శానికి రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, నల్గొండ లోకసభ ఎన్నికల డిప్యూటీ రిటర్నింగ్ అధికారి, స్పెషల్ కలెక్టర్ నటరాజ్ తదితరులు హాజర య్యారు.
9 candidates withdrawn nominations