Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Abdul Mannan suspended:జిల్లా వ్యవసాయ శాఖ పరిపాలనాధికారి అబ్దుల్ మన్నన్ సస్పెండ్

Abdul Mannan suspended:ప్రజా దీవెన, నల్లగొండ: ఏలాంటి ముందస్తు అనుమతి లేకుండా, సెలవు సైతం పెట్టకుండా 3 రోజుల నుండి విధులకు గైర్హాజరవుతు న్నందుకుగాను జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో పరిపాలన అధికారిగా పనిచేస్తున్న అబ్దుల్ మన్నన్ (Abdul Mannan)ను తక్షణమే సస్పెండ్ (suspended) చేస్తు న్నట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయ ణరెడ్డి (C. Narayana Reddy)తెలిపారు.శనివారం ఆయన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిబ్బంది హాజరు రిజిస్టర్ ను, రైతు రుణమాఫీకి సంబంధించి ఏర్పాటు చేసిన ఫిర్యాదుల విభాగాన్ని తనిఖీ చేశారు.

హాజరు రిజిస్టర్ పరిశీలన సందర్బంగా కార్యాలయ పరిపాలనాధికారి అబ్దుల్ మన్నన్ గడచిన మూడు రోజులుగా విధులకు గైర్హాజరవుతున్నట్లు గుర్తించిన జిల్లా కలెక్టర్ వివరాలను అడగగా, ఎలాంటి సెలవు దరఖాస్తు చేసుకోలేదని, అలాగే సమాచారం సైతం ఇవ్వలేదని కార్యాలయ సిబ్బంది జిల్లా కలెక్టర్ కు తెలుపగా దీనిపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం (The collector was outraged) వ్యక్తం చేస్తూ వెంటనే అబ్దుల్ మన్నన్ ను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. పనివేళల్లో కార్యాలయంలో ఉండకపోయినా, ఎలాంటి సమాచారం లేకుండా, ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఏ శాఖ ఉద్యోగులనైనా వదిలిపెట్టేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. అందువల్ల జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ సమయపాలన పాటించాలని, ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావద్దని కోరారు.

రైతు రుణమాఫీకి (Farmer loan waiver) సంబంధించి ఏర్పాటు చేసిన ఫిర్యాదుల విభాగాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులను రిజిస్టర్ లో పరిశీలించారు. రుణమాఫీ డబ్బులు జమ కాలేదని కార్యాలయానికి వచ్చే రైతులకు పూర్తిస్థాయిలో సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకుగాను రెండు ఫోన్ నెంబర్లు తక్షణమే ఏర్పాటు చేయాలని, వాటిని నమోదు చేసేందుకు, మాట్లాడేందుకు ఇద్దరు చొప్పున నలుగురు ఉద్యోగులను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా రైతులకు వెంటనే వివరాలు తెలియజేసేందుకు కంప్యూటర్, లేదా ల్యాప్టాప్ లో లాగిన్ (login) అయి వారి సమస్యను పరిష్కరించేందుకు లేదా రుణమాఫీ డబ్బులు ఎందుకు జమకాలేదో తెలిపేందుకు వెంటనే రెండు కంప్యూటర్లు ,ఇద్దరు ఆపరేటర్లను ఏర్పాటు చేయాలని, వారికి సహాయకులుగా ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్ లను ఏర్పాటు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ ను ఫోన్లో (phones)ఆదేశించారు. అలాగే రుణమాఫీకి సంబంధించి కార్యాలయంలో పెద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు .

రుణమాఫీ (Farmer loan waiver)సమస్యలపై జిల్లా కార్యాలయానికి వచ్చే రైతులకు సంబంధిత వ్యవసాయ అధికారిని సంప్రదించాలని లేదా ఆయా బ్యాంకులలో సంప్రదించాలని సమాధానాలు చెప్పవద్దని, అక్కడికక్కడే సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని, లేనట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. తనకు రుణమాఫీ డబ్బులు 96,500 జమ కాలేదని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి కార్యాలయా నికి వచ్చిన చింతమల్ల సందీప్ కుమార్ తో జిల్లా కలెక్టర్ (collector) మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఆ రైతుకు సంబంధించిన బ్యాంకు మేనేజర్ లేదా వ్యవసాయ అధికా రితో మాట్లాడి లాగిన్ లో పరిశీలిం చి సమస్యను పరిష్కరిం చాలని పక్కనే ఉన్న వ్యవసాయ శాఖ ఏడి హుస్సేన్ బాబును ఆదేశించారు. రుణమాఫీ కి సంబంధించి ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే గతంలోనే జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్ 7288800023 కు ఫోన్ చేయాల ని, అదే విధంగా మండల, డివిజన్ స్థాయిలో ఏర్పాటు చేసిన ఫిర్యాదు విభాగాలలో సైతం అక్కడికక్కడే రైతులు కనుక్కోవా లని, అంతేకాక సంబం ధిత బ్యాంక్ అధికారులతో గానీ లేదా వ్యవసా య శాఖ అధికారులతో సంప్రదించి వారి రుణమాఫీకి (Farmer loan waiver)సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించు కోవా లని, మధ్యవర్తులను నమ్మవద్దని, ముఖ్యంగా రుణమాఫీకి సంబం ధించి డబ్బులు జమ చేసే విష యంలో సైబర్ నేరగాళ్లు ఫోన్ల ద్వారా అడిగే వివరాలకు స్పం దించవద్దని, ప్రత్యేకంగా ఓటి పి ,ఆధార్ నంబర్ వంటివి చెప్ప వద్దని అయిన పునరుద్ఘాటిం చారు.