ప్రజా దీవెన, నల్గొండ టౌన్: నల్గొండ పట్టణంలోని కాపురాల గుట్టగా పిలువబడే అతి పురాతనమైన కోట అన్యమతస్తుల చేతిలో ఆక్రమణకు గురికాకుండా కాపాడాలని బిజెపి జాతీయ నాయకులు పేరాల శేఖర్ దృష్టికి తీసుకెళ్లిన ఐక్యరాజ్యసమితి అకడమిక్ కౌన్సిల్ సభ్యులు ఆదోని వెంకటరమణారావు , కో-ఆపరేట్ బ్యాంక్ మేనేజర్ ఉప్పల రవీందర్ కుమార్.
కాపురాల గుట్టపై పద్మనాయక రాజవంశీలచే నిర్మింపబడిన కోట , గుట్టపైన శివాలయం, కోట ఆనవాళ్ళకు సంబంధించిన బురుజులు, కోనేరు ఉన్నాయి అని .ప్రస్తుతం అవి శిథిలావస్థలో వున్నాయి అని తెలిపారు..ప్రస్తుతం కాపురాల గుట్ట కొంతమేరకు అన్యమతస్తుల ఆక్రమణకు గురైందని తెలిపారు..ఈ విషయంపై స్పందించిన పేరాల శేఖర్ కాపురాల గుట్టను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని నల్గొండ జిల్లా బిజేపీ కమిటీకి సూచించారు .
కాపురాల గుట్టను అక్రమనకు గురి కాకుండా కాపాడి రాబోయే తరాలకు ప్రాచీన సంస్కృతి యొక్క విశిష్టతను తెలియజేసే విధంగా అభివృద్ధి చేసి, పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయించే విధంగా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తన వంతు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని వెంకటరమణ రావు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం. వర్షిత్ రెడ్డి, బిజెపి నాయకులు దోనూరి వీరారెడ్డి,కంచర్ల విద్యాసాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు