Altaf Hussain: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయా నికి నూతన ఉపకులపతిగా ఆచార్య అల్తాఫ్ హుస్సేన్ (Altaf Hussain) నియమిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 9 విశ్వవిద్యాలయాలకు సైతం ఉప కులపతులను ప్రభుత్వం నియమించింది. ఆచార్య అల్తాఫ్ హుస్సేన్ (Altaf Hussain) గతంలో జులై రెండు 2016 నుండి 29 జూన్ 2019 వరకు ఎంజియు ఉపకులపతిగా సేవలందించారు. ఎంజియూ మొట్టమొదట న్యాక్ అక్రిడేషన్ (NAC Accreditation) కు నాయకత్వం వహించి “బి” గ్రేడ్ సాధనకు కృషి చేశారు. వారి హయాంలో ఇంజనీరింగ్ కళాశాల, స్పోర్ట్స్ కాంప్లెక్స్, బాలురు మరి యు బాలికల అదనపు హాస్టల్స్, ఎగ్జామ్ బ్రాంచ్ భవనాలకు శంకు స్థాపనలు చేశారు. సుదీర్ఘ అను భవం కలిగిన అల్తాఫ్ హుస్సేన్ నియామకం పట్ల అధికారులు, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.