–ఉపకులపతి ఆచార్య అల్తాఫ్ హుస్సేన్
Altaf Hussain: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (Mahatma Gandhi University) పరిధిలోని బిఈడి పాఠ్యప్రణా ళికలో మార్పుల అనుగుణంగా బోధనకొరకు బీఈడీ (bed)అధ్యాపకులు మరియు యాజమాన్యాలకు ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు. ఆడి ట్ సెల్ డైరెక్టర్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి అధ్యక్షతన జరిగిన శిక్షణ కార్యక్రమానికి ఉస్మానియా విశ్వవి ద్యాలయ ఆచార్యులు శంకర్, సునీత, లలిత , దుర్గేషంలు బోధన, మూల్యాంకనం, ఇంట ర్నల్, అసైన్మెంట్స్, రికార్డులు, బోధనలో ఐటి మరియు కృత్రిమ మేధా వినియోగంపై అధ్యాపకు లకు శిక్షణ (trainig)ఇచ్చారు. ఈ సంద ర్భంగా ఉప కులపతి ఆచార్య అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయులను తద్వారా జాతి నిర్మాణానికి బీఈడీ విద్య దోహదపడుతుందన్నారు.
బాధ్యతగా భావించి నాణ్యమైన మానవ వనరులను దేశానికి అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి, ఓ ఎస్ డి మరియు ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, జయంతి, సరిత, బీఈడీ కళాశాలల ప్రిన్సిపాళ్ళు, అధ్యాపకులు పాల్గొన్నారు.