–ఎంజియు రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి
Aluvala Ravi: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మహాత్మా గాంధీ విశ్వవిద్యాల యం (Mahatma Gandhi University) సైన్స్ కళాశాల వేదికగా గణి తశాస్త్రం విభాగం, తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ( టీజీ కాస్ట్ ) సహకారంతో జాతీ య గణిత శాస్త్ర దినోత్స వాన్ని పురస్కరించుకొని “రీసెంట్ అడ్వాన్సస్ ఇన్ మ్యాథమెటికల్ సైన్సెస్ ” అంశంపై ఒకరోజు జాతీ య సెమినార్ ను నిర్వహించారు . గణిత శాస్త్ర విభాగ అధిపతి డా మద్దిలేటి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథు లుగా రిజిస్ట్రార్ ఆచార్య అలు వాల రవి (Aluvala Ravi), ఆచార్య బిసి ప్రసన్న కుమార దేవనగిరి విశ్వవిద్యాల యం, కర్ణాటక కృత్రిమ మేధా, మెషిన్ లెర్నింగ్ వినియోగంలో గణిత శాస్త్ర o పై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆచార్య అలు వాల రవి (Aluvala Ravi) మాట్లాడుతూ ఉత్పత్తి, సేవా రంగం ఇతరత్రా మానవ మనుగడకు ఉపకరించే ప్రతి అంశంలో గణిత శాస్త్రం సేవలను వివరించారు. మేధస్సు, విశ్లేషణ, చురుకుదనంతో (intelligence, analysis, agility) పెంపొందించ డంతోపాటు పాటు సమాజ హితై శిలా గణితం మానవ సమాజంతో మమేకమై ముందుకు నడిపిస్తుం దన్నారు. అనంతరం ప్రధాన వక్త ఆచార్య బిసి ప్రసన్న కుమార దేవనగిరి విశ్వవిద్యాలయం, కర్ణాటక కృత్రిమ మేధా మరియు మెషిన్ లర్నింగ్ లో గణిత శాస్త్ర వినియోగంపై విద్యార్థులకు వివరించారు. జీవశాస్త్రాలు రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం సామాజిక శాస్త్రాల్లో జరిగే ప్రతి పరిశోధనలో విశ్లేషణలకు గణితం యొక్క ఆవశ్యకతను వివరించారు. కృత్రిమ మేధ ద్వారా పరిశోధనల్లో నమూనాల పరిమాణంతో సంబంధం లేని ఖచ్చితమైన విశ్లేషణలు అందిస్తాయన్నారు. నేడు అన్ని రంగాలలో కృత్రిమ మేధ వినియోగం నానాటికి పెరుగుతున్న దృశ్య విద్యార్థులు అవగాహన పెంచుకొని ముందుకు సాగాలన్నారు.
నేడు బెంగుళూరు నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు (Traffic control) ఏఐ వినియోగం ఒక ఉదాహరణగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఓ ఎస్ డి ఆచార్య కొప్పుల అంజిరెడ్డి కళాశాల ప్రిన్సిపాల్ డా ప్రేమ్ సాగర్, సైన్స్ డీన్ ఆచార్య వసంత, సి ఓ ఈ డా ఉపేందర్ రెడ్డి, డా హైమావతి, డా శ్రీనివాస్ డా కిరణ్ కుమార్, డా రామచంద్రుడు,మాధురి, రూప, తిరుమల, సత్తిరెడ్డి , స్వామి, మధుసూదన్ రెడ్డి భిక్షమయ్య, చిలుకూరి రమేష్ తదితర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.