Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Aluvala Ravi: వ్యక్తిత్వ వికాసం సమ్మిళిత సామా జిక పరివర్తన ఎన్ఎస్ఎస్ లక్ష్యం…

–ఎంజీయు రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి

Aluvala Ravi: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో జాతీయ సేవ పథక దినోత్సవాన్ని కోఆర్డినేటర్ డా మద్దిలేటి అధ్యక్ష తన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి (Aluvala Ravi), ప్రకృతి వ్యవసాయ ప్రేమికుడు ఏదుళ్ల అంజిరెడ్డి, ఓ ఎస్ డి ఆచార్య కొప్పుల అంజిరెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. కోఆర్డినేటర్ డా మదిలేటి జాతీయ సేవా పథకం (National Service Scheme) యొక్క లక్ష్యాలను మరియు ఎంజీయూ పరిధిలోని 169 శాఖల యొక్క పనితీరును వివరించారు. ఎంజీయూ పరి ధిలోని శాఖలు వినూత్నమైన పద్ధతులలో సామాజిక అంశాలను స్పృశించడంలో తెలంగాణ రాష్ట్రా నికి ఆదర్శవంతంగా నిలిచింద న్నారు.

కార్యకర్తలను ఉద్దేశించి రిజిస్ట్రార్ మాట్లాడుతూ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీ బుర్ర వెంకటేశం (Burra Venkatesham) ఐఏఎస్ సూచనల మేరకు బాలికల రక్షణ అభివృద్ధి, మాదకద్రవ్యాల నిర్మూలన, యాంటీ ర్యాగింగ్ స్వచ్ఛభారత్ అంశాలు ప్రతిబింబించేలా జాతీయ సేవా పథక దినోత్సవాన్ని నిర్వహించాలనే సూచనలకు అనుగుణంగా కార్యక్రమాన్ని రూపొందించినట్టు తెలిపారు. వ్యక్తి నిర్మాణం ద్వారానే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రతి పౌరుడు బాధ్యతగా మెలిగి దేశ సామాజిక రాజకీయ ఆర్థిక అంశాలను అర్థం చేసుకొని దేశ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఆర్థి దశలోనే సామాజిక అంశాలపై అవగాహన ద్వారా, అభ్యసనం లో పరిష్కార మార్గాల అన్వేషణ అవసరమన్నారు.

కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఏదుల అంజిరెడ్డి (Anji Reddy) మాట్లాడుతూ పూర్ణ ఆరోగ్యంతో మనగలగాలి అంటే ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలన్నారు. సమస్యలకు ప్రకృతి వ్యవసాయం సరైన మార్గమని సూచించారు. అనంతరం వివిధ కళాశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నృత్యం, పాటలు మెహెంది అంశాలలో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. అనంతరం గెలుపొందిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు మరియు బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్పిఓలు డా రామచంద్రుడు, నేలకంఠం, సైదులు నాగరాజు, సుధాకర్, తదితర పిఓలు విద్యార్థులు పాల్గొన్నారు.