ప్రజదీవెన, నల్గొండ: విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న అధ్యాపకుల పదవి విరమణ వయోపరిమితిని 65 కు పెంచాలని అధ్యాపకులు రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవికి వినతి పత్రం సమర్పించారు. విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల కొరత కారణంగా పరిశోధనల్లో స్తబ్దత నెలకొన్న దృష్ట్యా పెంపు నాణ్యమైన విద్యను పరిశోధనలను అందించడానికి ఉపయోగపడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో డా మాధురి, డా సబీనా హెరాల్డ్, డా శివరాం డా తిరుమల, డా సంధ్యారాణి, డా శ్వేత, డా జయంతి, డా కళ్యాణి పాల్గొన్నారు.