Amali Workers welfare Board: హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న హమాలీలకు వెంటనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని *తెలంగాణ హాల్ అమాలి వర్కర్స్ ఫెడరేషన్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరి రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హమాలీలను ఉద్యోగులుగా గుర్తించాలి
హమాలీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరి రాములు
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: కాంగ్రెస్ మేనిఫెస్టోలో(congress manifesto ) ప్రకటించిన విధంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న హమాలీలకు వెంటనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని *తెలంగాణ హాల్ అమాలి వర్కర్స్ ఫెడరేషన్(Telangana Hall Amali Workers Federation) (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరి రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండ పట్టణంలోని టీజి బీసీఎల్, ఎఫ్సీఐ, ఎలక్ట్రిసిటీ స్టోర్ హమాలీలను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ అసంఘటిత రంగంలో ఎగుమతి దిగుమతులు నిర్వహిస్తున్న హమాలీలకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు తరహాలో హమాలీలకు పిఎఫ్, ఈఎస్ఐ ,ప్రమాద బీమా, పెన్షన్ తదితర సౌకర్యాలతో హమాలీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గోదాముల దగ్గర మంచినీళ్లు, భోజనశాల, సైకిల్ స్టాండు, విశ్రాంతి గదులు నిర్మించాలని, ప్రభుత్వ సంస్థల లో ఎగుమతి దిగుమతి పనులు చేస్తున్న హమాలీలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. నేటికీ బజార్లో కూరగాయల మార్కెట్లు 100 కేజీల పైగా బస్తాలు వస్తున్నాయని ఐఎల్ఓ తీర్మానం ప్రకారం 40 కేజీల బస్తాలను అన్ని ప్రాంతాల్లో కచ్చితంగా అమలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
50 సంవత్సరాలు నిండిన హమాలీలకు కనీస పెన్షన్(Pension) 6000 నిర్ణయించి వెంటనే అమలు చేయాలని డిమాం డ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలం గాణ హాల్ హమాలి వర్కర్స్ ఫెడరే షన్ (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, టిజి బిసిఎల్ అమాలి వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సల్లా యాదయ్య కార్యదర్శి లొడంగి ఉపేందర్, ఎఫ్సీఐ అమాలి వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పల్లె నగేష్, ఎలక్ట్రిసిటీ స్టోర్ అమాలి వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కత్తుల యాదయ్య, కార్యదర్శి శంకర్, యాదగిరి రెడ్డి, వంగూరు అశోక్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
Amali Workers welfare Board