–చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే కఠిన చర్యలు
–గణేష్ ఉత్సవాల నేపద్యంలో నల్ల గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్, బైండ్ ఓవర్
–నల్లగొండ వన్ టౌన్ సిఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి
Ami Reddy Rajasekhar Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్గొండ జిల్లా ఎస్. పి శరత్ చంద్ర పవార్ ఆదేశానుసారం రానున్న గణేష్ ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని నల్గొండ వన్ టౌన్ పరిదిలో ఉన్న రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేస్తూ వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా సిఐ రాజశేఖర్ రెడ్డి (Ami Reddy Rajasekhar Reddy)మాట్లాడుతూ రౌడీ షీటర్ల పై పోలీసుల నిఘా ఎప్పుడు ఉంటుందని, రానున్న గణేష్ ఉత్స వాలలో (During Ganesh festivals) ఎటువంటి అసాంఘిక కా ర్యకలాపాలు చేయాలని ప్రయ త్నించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదే విధంగా పోలీస్ స్టేషన్ కి ప్రతి వారం అందరూ విధిగా హాజరై సంతకాలు చేయాలని, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్ప డితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీ షీటర్ల (Rowdy sheeters)కద లికలు ఎప్పటికప్పుడు తమకు చేరతాయని, ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.