–ఐలూ జిల్లా కార్యదర్శి అనంతల శంకరయ్య డిమాండ్
Anantala Shankaraiah: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: దేశంలో నేటి నుంచి అమలవు తున్న మూడు కొత్త క్రిమినల్ చట్టాలు (New Criminal Laws)వెంటనే వాయిదా వేయాలని ఆల్ ఇండియా లాయర్స్ యూని యన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనం తుల శంకరయ్య (Anantala Shankaraiah), నల్గొండ బార అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గిరి లింగయ్య గౌడ్ (Giri Lingaya Goud)లు డిమాండ్ (demand)చేశారు. కొత్త చట్టాలపై దేశవ్యా ప్తంగా లాయర్స్ చేస్తున్న నిరసనలో భాగంగా నల్లగొండ జిల్లా కోర్టు ముం దు నల్లగొండ న్యాయవాదులు సోమవారం ప్లే కార్డ్స్ ధరించి నిర సన ప్రదర్శన చేశారు. కొత్త చట్టాల వల్ల విచారణ జాప్యం జరుగుతుం దని మానవ ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందని తెలియజేశా రు. కొత్త క్రిమినల్ (Criminal Laws) మేజర్ చట్టాల వల్ల న్యాయవ్యవస్థపై ప్రతికూల ప్రభావం కలుగుతుందని న్యాయవాదులు (Lawyers)అభిప్రాయపడ్డారు. ఈ కొత్త చట్టాల వల్ల పోలీస్ అధిక అధికారం మరింత పెరుగుతుందని అందువల్ల పోలీసులు చట్టాలను దుర్వినియోగం చేసే అవకాశం ఎక్కువగా ఉందని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో నల్లగొండ న్యాయవా దులు జమీల్, డి నర్సాజి, సంపత్ కుమార్, నజీరిద్దీన్, మామిడి బాల య్య, ప్రమీల, గుర్రం వెంకటరెడ్డి భువనగిరి రవి,లింగస్వామి ఎండి రైముద్దీన్, కార్తీక్, అజ్మీర్ ఖాన్, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.