Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Apka Nageswara Rao: వైజ్ఞానిక దృక్పథానికి ఆధ్యులు ఆదివాసీలు

–ఉస్మానియా విశ్వవిద్యాలయ జు వాలజీ అధ్యాపకులు డా ఆప్కా నాగేశ్వరరావు

Apka Nageswara Rao: ప్రజా దీవెన, నల్లగొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో నిర్వ హించిన ప్రపంచ ఆదివాసి దినోత్స వ కార్యక్రమానికి ఓఎస్డి ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయ జువాలజీ అధ్యా పకులు డా ఆప్కా నాగేశ్వరరావు (Apka Nageswara Rao) ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యా ర్థులను ఉద్దేశించి ప్రసంగించారు. డా మద్దిలేటి అధ్యక్షతన సైన్స్ కళాశాల (College of Science) వేదికగా జరిగిన కార్యక్ర మంలో ముందుగా ఆదివాసుల చైతన్యానికి ప్రతీకైనా పతాక ఆవి ష్కరణ కావించారు.

ఈ సందర్భం గా ఆప్కా నాగేశ్వరరావు (Apka Nageswara Rao)మాట్లాడు తూ తొలి శాస్త్రవేత్తలు ఆదివాసు లని, పర్యావరణహిత జీవనానికి, నాగరికతకు నడకలు నేర్పిన దార్శ నీకులని కొనియాడారు. నేడు దేశ వ్యాప్తంగా ఆదివాసులు విద్యా వైద్యం వంటి కనీస అవసరాలకు అభివృద్ధికి ఆమడ దూరంలో దుర్భ రమైన జీవితాలను వెళ్ళదియ్యడం అత్యంత విచారకరమన్నారు. అనే క కష్ట నష్టాలను ఓర్చి విశ్వవిద్యాల య స్థాయికి చేరిన ఆదివాసి విద్యా ర్థులు న్యూనతా భావాలను వదిలి సుశిక్షితులై సమాజ హితం కొరకు తోడ్పడాలని సూచించారు. నిరంత ర అధ్యయనంతో ఆదివాసి సమా జానికి జరుగుతున్న అన్యాయాలపై గొంతేత్తి హక్కుల పరిరక్షణకు పాటు పడాలని సూచించారు. కనీస ప్రాథమిక విద్య సైతం అందని అనేక ఆదిమ జాతి తెగల అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని సూచించారు. అనంతరం సంస్కృతి సాంప్రదాయాలు రక్షణ, బాధ్యతాయుతమైన క్రియాశీలక పౌరులుగా కృషి చేయాలంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

అనంతరం ఆచార్య కొప్పుల అంజిరెడ్డి (Koppula Anji Reddy) మాట్లాడుతూ విద్యాధికులు చైతన్యవంతమైన సమాజానికి హక్కుల పరిరక్షణకు స్ఫూర్తిదాయక చొరవను, పాత్ర పోషించాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల చేసిన సాంప్రదాయక నృత్యాలు ప్రదర్శనలు సభికులను అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా తిరుమల, డా కే మాధురి తదితర అధ్యాపకులు, పీహెచ్డీ స్కాలర్ నవీన్, కొమరం రమేష్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.