Komatireddy Venkat Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్ : నల్లగొండ (Nalgonda) పట్టణంలోని స్థానిక 18వ వార్డులో నెలకొన్న పలు సమస్యలపై బుధవారం పిఎసిఎస్ (PACS) చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు (Nagarathnam Raju) ఆధ్వర్యంలో రాష్ట్ర రోడ్డు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) ని హైదరాబాదు (Hyderabad)లో వారి నివాసంలో వార్డు సభ్యులతో కలిశారు.
ఈ సందర్భంగా 18 వ వార్డు అలివేలుమంగాపురం కాలనీలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సిసిరోడ్లు (CC Roads) మొదలగు సమస్యలను మంత్రి కోమటి వెంక రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. అందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సానుకూలంగా స్పందించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సిసి రోడ్లను పూర్తిచేసి వార్డును పూర్తిదశలో అభివృద్ధి చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ పిఎసిఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, అలివేలుమంగాపురం కాలనీ ప్రెసిడెంట్ దండా వెంకటరామిరెడ్డి,జనరల్ సెక్రెటరీ చనగోని ముత్తయ్య గౌడ్, వైస్ ప్రెసిడెంట్ గుండపనేని కిషన్ రావు, రేణుక ఎల్లమ్మ గుడి మాజీ చైర్మన్ ప్రెసిడెంట్ వుగ్గె పులేందర్, నాగిళ్ల నరసయ్య తదితరులు పాల్గొన్నారు.