–పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు అశ్విని చంద్ర శేఖర్
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: న్యాయపరమైన డిమాండ్ల సాధనకై సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె కు ప్రభుత్వం సత్వరమే పరిష్కరిం చాలని పి ఆర్ టి యూ టి ఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు అశ్విని చంద్ర శేఖర్ డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సర్వీసును క్రమ బద్ధీక రించాలని, పే స్కేల్ వర్తింపజే యాలని, రూ.20 లక్షల జీవితా బీమా, రూ. 10 లక్షలు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాల ని,ప దవీ విరమణ ప్రయోజనాల కింద రూ.25 లక్షలు చెల్లించాలని, ప్రభు త్వ ఉద్యోగాల భర్తీలో వెయిటేజీ మార్కులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మహబూబ్ నగర్ లో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె మంగళ వారం నాటికి 15 రోజులకు చేరింది.
ఈ సందర్భంగా పి ఆర్ టి యూ టి ఎస్ కౌకుంట్ల మండల శాఖ అధ్యక్షులు పురేందర్ రెడ్డి, దేవరకద్ర మండల శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ యాదవ్, జి హెచ్ ఎం మారుతి నారాయణ లతో కలిసి రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు అశ్విని చంద్ర శేఖర్ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించి ప్రసంగించారు. న్యాయ పరమైన డిమాండ్ల సాధనకై గత 15 రోజుల నుంచి సమగ్ర శిక్ష ఉద్యోగులు నిర్వహిస్తున్న సమ్మె కు ప్రభుత్వం సత్వరమే సానుకూలంగా స్పందించి డిమాండ్ల ను పరిష్కరించాలని కోరారు. దాదాపు రెండు దశాబ్దాలుగా చాలి చాలని వేతనాలతో కుటుంబాలను పోషించ లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం సానుభూతి తో పరిశీలించి పరిష్కరించాలని చంద్ర శేఖర్ విజ్ఞప్తి చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కారణంగా కె జీ బి వి లలోని విద్యార్థినులు చదువుకు దూరమతున్నారని , యం ఆర్ సి , విద్యా శాఖ కార్యాలయాల్లో అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయని వాపోయారు. ఈ విషయంగా ప్రభుత్వం ఎలాంటి తాత్సారం లేకుండా సత్వరమే సానుకూలంగా స్పందించి సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జి హెచ్ ఎం మారుతి నారాయణ, పి ఆర్ టి యూ టి ఎ స్ నాయకులు పురెందర్ రెడ్డి, శ్రీకాంత్ యాదవ్,
సమగ్ర శిక్ష ఉద్యోగుల జే ఏ సి అధ్యక్షులు శ్రీనివాసులు, కార్యనిర్వహక అధ్యక్షులు ఖాజా మైనొద్దీన్, ప్రధాన కార్యదర్శి యాదగిరి, కోశాధి కారి యం .డి. ఇక్రం, నాయకులు కౌకుంట్ల శ్రీనివాసులు, అనురాధ, తదితరులు పాల్గొన్నారు.